అర్జెంట్ అయినా ఆపుకోవాల్సిందే..!
దిశ, తెలంగాణ బ్యూరో: ‘అత్యవసరం’ ప్రచార ఆర్భాటానికి అస్త్రంగా మలుచుకున్నారు. గ్రేటర్‌లో టాయిలెట్ల ఏర్పాటులో తీవ్రజాప్యం జరుగుతోంది. ఎన్నికల వేళ హడావుడి చేసి ముగియగానే అటకెక్కించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవాప్తంగా 11 వేల టాయిలెట్స్ ఏర్పాటు చేయనుండగా, భాగ్యనగరంలో 7వేలు నిర్మిస్తామని, ఆగస్టు 15లోగా లక్ష్యానికి చేరుకుంటామని అధికారులు ప్రకటించారు. గడువు ముగిసి ఆరునెలలైనా పట్టించుకునే నాథుడే లేడు. కేవలం 3,300 టాయిలెట్లు ఏర్పాటు చేశారు. నీరు, విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడంతో అలంకారప్రాయంగా మారాయి. టాయిలెట్స్ లేక […]
దిశ, తెలంగాణ బ్యూరో: ‘అత్యవసరం’ ప్రచార ఆర్భాటానికి అస్త్రంగా మలుచుకున్నారు. గ్రేటర్‌లో టాయిలెట్ల ఏర్పాటులో తీవ్రజాప్యం జరుగుతోంది. ఎన్నికల వేళ హడావుడి చేసి ముగియగానే అటకెక్కించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవాప్తంగా 11 వేల టాయిలెట్స్ ఏర్పాటు చేయనుండగా, భాగ్యనగరంలో 7వేలు నిర్మిస్తామని, ఆగస్టు 15లోగా లక్ష్యానికి చేరుకుంటామని అధికారులు ప్రకటించారు. గడువు ముగిసి ఆరునెలలైనా పట్టించుకునే నాథుడే లేడు. కేవలం 3,300 టాయిలెట్లు ఏర్పాటు చేశారు. నీరు, విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడంతో అలంకారప్రాయంగా మారాయి. టాయిలెట్స్ లేక నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలోనే ఆరోపణలు వచ్చిన కంపెనీలకు సైతం ఏర్పాటు బాధ్యతలు అప్పగించడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నగరంలో కనీస సౌకర్యాలను కల్పన అంశాలను కూడా అధికార పార్టీ రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. రెండు నెలల ముందు గ్రేటర్‌లో పబ్లిక్ టాయిలెట్లను హడావిడిగా ఏర్పాటు చేసినా ఎన్నికలు ముగిసిన తర్వాత పట్టించుకునేవారే కరువయ్యారు. ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన టాయిలెట్లకు తాళాలు తెరుచుకోకపోవడంతో బహిరంగ మూత్ర విసర్జన కొనసాగుతోంది. మరో వైపు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో ప్రతీ వెయ్యి మందికి ఒక టాయిలెట్ చొప్పున ఏర్పాటు చేసి, అందులో 50శాతం మహిళలకే కేటాయిస్తామని ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ప్రకటించారు.
ఎంఏయూడీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 11 వేల టాయిలెట్లను నిర్మిస్తుండగా అందులో 7వేలు జీహెచ్ఎంసీ పరిధిలో ఉంటాయని, ఈ లక్ష్యాన్ని ఆగస్టు 15 నాటికే చేరుకుంటామన్నారు. గడువు దాటి ఆరు నెలలైనా ఇప్పటికీ పనులు పూర్తికాలేదు. ఎన్నికల సమయంలో సైతం టాయిలెట్లను అందుబాటులోకి తేలేకపోయారు. సిటీలో 15 వేల టాయిలెట్లను నిర్మిస్తామని గతంలోనే ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఒక్కో టాయిలెట్ నిర్మాణానికి డిజైన్‌ను బట్టి రూ.60 వేల నుంచి రూ.1.50 లక్షల వరకూ ఖర్చు వస్తుందని అంచనా వేశారు. అర్బన్ ఏరియాల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి స్వచ్ఛ భారత్ అభియాన్ కింద కేంద్రప్రభుత్వ సహ కారం కూడా లభిస్తుంది. లాక్‌డౌన్ తర్వాత ఉద్యో గాలు, వ్యాపారాలు, ఇతర పనుల కోసం, సిటీలోని టూరిస్టు ప్రదేశాలు చేసేందుకు ప్రజలు బయటకొచ్చేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. జనాలు ఎక్కువగా ఉంటే ప్రదేశాల్లో టాయిలెట్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలకు ఇదో పెద్ద సమస్యగా తయారైంది. ప్రభుత్వ అధికారులు చెబుతున్నట్టు 50శాతం పూర్తిగా వారికే కేటాయించడం ఎప్పుడవుతుందో గానీ ఉన్నవి ఉపయోగించుకునే స్థితిలో కూడా లేవు.
నగరంలో 3వేలు..
సిటీలో మొత్తం 3వేల టాయిలెట్లను ఏర్పాటు చేస్తా మని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. గతంలో 300 టాయిలెట్లలో 1,100 మంది సీటింగ్ కెపాసిటీ ఉండేది. ఎన్నికలకు ముందు కొత్తగా 3వేల టాయిలెట్లను ఏర్పాటు చేసే కార్యక్రమం యుద్ధప్రాతిపదికన ప్రారంభమైంది. రెడీమేడ్ టాయిలెట్లను తీసుకొచ్చి పెట్టాలని ప్రతిపాదించారు. 200 -300 మీటర్లకొక టాయిలెట్‌ను ఏర్పాటు చేయాలనే నిబంధనలు తయారు చేయగా అనుకూలతను బట్టి ఒకే చోట రెండు, మూడు టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా పూర్తిగా నిబంధనలు అతిక్రమించడం గమనార్హం. ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ స్వయం గా సిటీ ప్రజలకు ‘ వాకర్స్ ఫ్రీ’ ఫుట్‌పాత్‌లను అందిస్తామన్నారు. అందుకోసం వాటిపై ఏర్పాటు చేసిన దుకాణాలు, ఆక్రమణలు తొలగించే పనులు నిరాటం కంగా కొనసాగిస్తున్నారు. అయితే, జీహెచ్ఎంసీ అధికారులు టాయిలెట్లను ఎక్కువ స్థలం ఉన్న ప్రదేశాల్లో దించేసి తమ పనైపోయినట్టు వెళ్లిపోయారు. ఎన్నికల ముందు లారీల్లో తీసుకొచ్చి ఆ తర్వాత అటువైపు క న్నెత్తి కూడా చూడలేదు. ఇప్పటికీ అవన్నీ తాళాలు వేసే ఉన్నాయి. ఎలక్షన్స్ సమయంలో వీటిపై టీఆర్ఎస్ రాజకీయ ప్రచారం చేసుకునేలా బ్యానర్లు ఏర్పాటు చేసుకోవడం పెద్ద దుమారాన్నే రేపింది. ప్రజలకు సౌకర్యంగా ఉండాల్సినవాటిపై ప్రచారం ఆసక్తి కనబరిచిన ప్రభుత్వం వాటిని మెరుగుపరిచే దిశగా సాగలేదు. అధికారులు సైతం టాయిలెట్లలో కరెంట్, నీటి సౌకర్యాలను కల్పించ లేదు.
మూడు కంపెనీలకు బాధ్యతలు..
నగరంలో టాయిలెట్ల ఏర్పాటు అటు అధికారులు, ఇటు ప్రైవేట్ కంపెనీలకు లాభదాయకంగా మారింది. రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనుకున్న 11 వేల టాయిలెట్ల బాధ్యతను మూడు ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పారు. ఇందులో ఎక్సోరా కంపెనీదే మెజార్టీ వాటా. సదరు కంపెనీపై గతంలో అప్పగించిన పనులనే పూర్తి చేయలేకపోయిందనే విమర్శలు ఉన్నాయి. సిటీలో 178 కేఫ్‌లు నిర్మించే బాధ్యతలను అప్పగించారు. ఇప్పటి వరకు అందులో సగం కూడా పూర్తి చేయలేకపోయింది. ఏర్పాటు చేసినవి సైతం రోజూ తెరుచుకోవడం లేదు. లూకేఫ్‌లు నిర్మించామనే పేరుతో సదరు కంపెనీ ఉచిత విద్యుత్‌తో పాటు జీహెచ్ఎంసీకి చెందిన స్థలాలను పొంది వ్యాపారాలు నిర్వహించుకుంటోంది. గతంలో అప్పజెప్పిన పనులు పూర్తి చేయకపోయినా మళ్లీ అదే కంపెనీకి పనులు అప్పగిస్తున్నారు. అత్యవసరమైన టాయిలెట్లపై అధికారులు అంతగా ఆసక్తి చూపడం లేదు.
వినియోగంలోకి తీసుకురావాలి :డాగ హరీశ్, ఐటీ ఉద్యోగి
కొత్తగా ఏర్పాటు చేసిన 11వేల టాయిలెట్లలో 50శాతం మహిళలకు కేటాయించారు. ఎలక్షన్స్ ముందు ప్రచారం కోసం హడావిడిగా ఎక్కడిక్కడ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ట్యాక్స్ పేయర్స్ డబ్బులన్నీ వృథా చేస్తున్నారు. సెక్రటేరియట్ నుంచి బంజాహిల్స్ వరకూ నేను ఆఫీస్‌కు వెళ్లే రూట్‌లో 50వరకూ ఉన్నాయి. ఒక్కటి కూడా తాళం ఓపెన్ చేసి లేవు. ప్రచారం కోసం బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. ఇప్పడు వాటిని పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ వాటర్ సౌక ర్యం కల్పించలేకపోయారు. వేల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన వాటిని ఇప్పటికైనా వినియోగంలోకి తేవాలి.