ఉత్కంఠ రేపుతున్న వారి పర్యటన

దిశ, వెబ్‌డెస్క్ : భారత్, చైనా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ సమయంలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే దేశ సరిహద్దుల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. బార్డర్‌లో నివురుగప్పిన నిప్పుల ఉన్నా ఈ సమయంలో వారిద్దరి పర్యటన దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ప్రపంచ దేశాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న చైనా.. తన కవ్వింపు చర్యలను మాత్రం మానుకోవడం లేదు. బార్డర్‌కు సమీపానికి తన […]

Update: 2020-07-01 07:55 GMT

దిశ, వెబ్‌డెస్క్ : భారత్, చైనా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ సమయంలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే దేశ సరిహద్దుల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. బార్డర్‌లో నివురుగప్పిన నిప్పుల ఉన్నా ఈ సమయంలో వారిద్దరి పర్యటన దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ప్రపంచ దేశాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న చైనా.. తన కవ్వింపు చర్యలను మాత్రం మానుకోవడం లేదు. బార్డర్‌కు సమీపానికి తన దేశ బలగాలను తరలిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే వారు ఇరువురి పర్యటనకు ప్రాముఖ్యం సంతరించుకుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు చేపట్టారు.

మే నుంచి ఇండియా, చైనా మధ్య ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో.. రక్షణ మంత్రి లద్దాఖ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణేతో కలిసి శుక్రవారం సరిహద్దుల్లోని లద్దాఖ్‌కు వెళ్లనున్నారు. చైనా సరిహద్దుల్లో తాజా పరిస్థితులను వారు సమీక్షించనున్నారు. ఇప్పటికే ఆర్మీ వర్గాలు ఆ ఏర్పాట్లలో ఉన్నాయి. అటు ఆర్మీ చీఫ్ వారం వ్యవధిలో రెండో సారి లద్దాఖ్‌లో పర్యటించనున్నారు.

Tags:    

Similar News