ఈ నెల 17న లడాఖ్‌కు రక్షణ మంత్రి

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం లడాఖ్ పర్యటించనున్నారు. మిలిటరీ సన్నద్ధత, ప్రస్తుత పరిస్థితులను సమీక్షించనున్నారు. తొలిసారి లడాఖ్‌కు పర్యటించిన రాజ్‌నాథ్‌తో ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణె వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆ రీజియన్‌లోని భద్రతాంశాలపై ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణె, ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ యోగేష్ కుమార్ జోషి, 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరిందర్ సింగ్, ఇతర సీనియర్ అధికారులతో సమగ్రంగా సమీక్ష జరపనున్నట్టు తెలిసింది. అనంతరం […]

Update: 2020-07-15 10:10 GMT

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం లడాఖ్ పర్యటించనున్నారు. మిలిటరీ సన్నద్ధత, ప్రస్తుత పరిస్థితులను సమీక్షించనున్నారు. తొలిసారి లడాఖ్‌కు పర్యటించిన రాజ్‌నాథ్‌తో ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణె వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆ రీజియన్‌లోని భద్రతాంశాలపై ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణె, ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ యోగేష్ కుమార్ జోషి, 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరిందర్ సింగ్, ఇతర సీనియర్ అధికారులతో సమగ్రంగా సమీక్ష జరపనున్నట్టు తెలిసింది. అనంతరం లడాఖ్ నుంచి శ్రీనగర్ చేరుకుని పాకిస్తాన్ సరిహద్దు పరిస్థితులను సమీక్షించనున్నారు.

Tags:    

Similar News