సరిహద్దులో 6 వంతెనలు ప్రారంభించిన రాజ్‌నాథ్ సింగ్
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో నిర్మించిన ఆరు వంతెనలను కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ప్రారంభించారు. ఈ వంతెనలను ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించగా, ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్, త్రిదళాధిపతి బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ ఎం.ఎం నరవాణె తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ఉన్న ఈ వంతెనలను బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్వో) నిర్మించిందని వెల్లడించారు. వీటి నిర్మాణానికి రూ.43కోట్లు […]
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో నిర్మించిన ఆరు వంతెనలను కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ప్రారంభించారు. ఈ వంతెనలను ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించగా, ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్, త్రిదళాధిపతి బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ ఎం.ఎం నరవాణె తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ఉన్న ఈ వంతెనలను బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్వో) నిర్మించిందని వెల్లడించారు. వీటి నిర్మాణానికి రూ.43కోట్లు ఖర్చయ్యాయని వెల్లడించారు. వీటిలో రెండు బ్రిడ్జీలు కతువా జిల్లాలోని తార్నా నల్లా ప్రాంతాల్లో నిర్మించగా, నాలుగు వంతెనలు అఖ్నూర్‌లోని అఖ్నూర్-పల్లాన్‌వాల రోడ్డుపై నిర్మించామని వివరించారు. వీటి నిర్మాణం వల్ల సాయుధ దళాల కదలికలను సులభతరం చేస్తాయని తెలిపారు. అలాగే, జమ్ము కశ్మీర్ ప్రాంత అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలు, భద్రతా దళాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పైప్‌లైన్ నిర్మాణానికి కూడా సిద్ధమేనని తెలిపారు.