‘బైజు బావ్ర’ ప్రియురాలిగా దీపిక?

దేవ్‌దాస్, బాజీరావ్ మస్తానీ, రామ్‌లీలా, పద్మావతి లాంటి బ్లాక్ బస్టర్ క్లాసికల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ. ఇప్పుడు అలియా భట్ ప్రధానపాత్రలో ‘గంగుబాయి కతియావాడి’ సినిమాను తెరకెక్కిస్తున్న భన్సాలీ.. మరో సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట. 1952లో వచ్చిన ‘బైజు బావ్ర’ అనే బాలీవుడ్ క్లాసికల్ మూవీని రీమేక్ చేసేందుకు సంజయ్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక కథ విషయానికొస్తే.. మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థాన సంగీత కళాకారుడు తాన్‌సేన్‌కు సవాల్ […]

Update: 2020-05-30 06:46 GMT

దేవ్‌దాస్, బాజీరావ్ మస్తానీ, రామ్‌లీలా, పద్మావతి లాంటి బ్లాక్ బస్టర్ క్లాసికల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ. ఇప్పుడు అలియా భట్ ప్రధానపాత్రలో ‘గంగుబాయి కతియావాడి’ సినిమాను తెరకెక్కిస్తున్న భన్సాలీ.. మరో సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట.

1952లో వచ్చిన ‘బైజు బావ్ర’ అనే బాలీవుడ్ క్లాసికల్ మూవీని రీమేక్ చేసేందుకు సంజయ్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక కథ విషయానికొస్తే.. మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థాన సంగీత కళాకారుడు తాన్‌సేన్‌కు సవాల్ చేసే పాత్ర ‘బైజు బావ్ర’. కాగా ఈ సినిమాలో బైజు ప్రియురాలు గౌరీ పాత్ర కోసం అప్పుడే చర్చ మొదలైంది. మీనా కుమారి నటించిన ఈ పాత్ర కోసం ఎవరైతే సెట్ అవుతారనే ఆలోచనలో ఉన్నారట దర్శకుడు. ముందుగా నీలి కళ్ల సుందరి ఐశ్వర్య రాయ్‌ను అనుకున్నా.. తర్వాత బాలీవుడ్ దివా దీపికా పదుకొనె అయితే చాలా బాగుంటుందని భావిస్తున్నట్లు సమాచారం.

కాగా విజయ్ భట్ దర్శకత్వంలో వచ్చిన ‘బైజు బావ్ర’ చిత్రంలో బైజు, తాన్‌సేన్ పాత్ర పైనే ఎక్కువ దృష్టి పెట్టగా.. సంజయ్ లీలా తెరకెక్కించే రీమేక్‌లో గౌరీ క్యారెక్టర్‌కు కూడా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఈ వార్త విన్న విశ్లేషకులు హీరోయిన్ పాత్ర పెంచి.. దీపికను సెలెక్ట్ చేస్తే ఇంతకు ముందున్న సినిమా కన్నా ఈ చిత్రం అవుట్‌పుట్ చాలా బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News