తగ్గుతున్న హుస్సేన్‌సాగర్ నీటిమట్టం
దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో నీటిమట్టం తగ్గుతోంది. ఆదివారం రాత్రి 8గంటలకు 513.55 మీటర్లుగా ఉన్నది. వారంరోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలతో హుస్సేన్‌సాగర్‌లోకి వరద నీటితో పెరిగిన నీటిమట్టం ఆదివారం మధ్యాహ్నం నుంచి తగ్గుతూ వస్తోంది. గడిచిన 24గంటల్లో హుస్సేన్‌సాగర్ నీటిమట్టం 513.64 మీ.ల స్థాయికి చేరింది. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ లేక్స్ విభాగం జలాశయంలోని నీటిని తూముల ద్వారా క్రిందికి పంపిస్తున్నది. ఎప్పటికప్పుడు నీటి మట్టాలను పరిగణలోకి తీసుకుని దిగువన ఉన్న ప్రాంతాల్లో అత్యవసర చర్యలకు ఎన్‌డీఆర్ఎఫ్ […]
దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో నీటిమట్టం తగ్గుతోంది. ఆదివారం రాత్రి 8గంటలకు 513.55 మీటర్లుగా ఉన్నది. వారంరోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలతో హుస్సేన్‌సాగర్‌లోకి వరద నీటితో పెరిగిన నీటిమట్టం ఆదివారం మధ్యాహ్నం నుంచి తగ్గుతూ వస్తోంది. గడిచిన 24గంటల్లో హుస్సేన్‌సాగర్ నీటిమట్టం 513.64 మీ.ల స్థాయికి చేరింది. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ లేక్స్ విభాగం జలాశయంలోని నీటిని తూముల ద్వారా క్రిందికి పంపిస్తున్నది. ఎప్పటికప్పుడు నీటి మట్టాలను పరిగణలోకి తీసుకుని దిగువన ఉన్న ప్రాంతాల్లో అత్యవసర చర్యలకు ఎన్‌డీఆర్ఎఫ్ సిద్దంగా ఉన్నది.
హుస్సేన్‌సాగర్‌లో చేరిన వరద నీటిని రెండు అలుగులు, ఒక తూము ద్వారా బయటకు పంపించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. అడ్డుపడుతున్న చెత్త చెదారాన్ని క్లిన్‌టెక్ మిషన్, సిబ్బందితో తొలగిస్తున్నది. నగరవ్యాప్తంగా నిరంతరం పనిచేస్తున్న మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ బృందాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అధికారులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేస్తున్నది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ఆయా విజ్ఞాపనలు వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి ఆదేశించారు.