ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం పెరిగాయి. గత నాలుగు రోజులుగా రోజూ వెయ్యికిపైగా కేసులు నమోదవుతుండటం ఆందోళనకు దారితీస్తోంది. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 61,178 శాంపిల్స్ పరీక్షించగా 1,367 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య 20,34,786కు పెరిగింది. అదే సమయంలో కరోనాతో 14 మంది మృతి చెందగా.. తాజా […]

Update: 2021-09-16 11:25 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం పెరిగాయి. గత నాలుగు రోజులుగా రోజూ వెయ్యికిపైగా కేసులు నమోదవుతుండటం ఆందోళనకు దారితీస్తోంది. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 61,178 శాంపిల్స్ పరీక్షించగా 1,367 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య 20,34,786కు పెరిగింది. అదే సమయంలో కరోనాతో 14 మంది మృతి చెందగా.. తాజా మరణాలతో కలిపి కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 14,044కు పెరిగింది.

గత 24 గంటల్లో కరోనా నుంచి 1,248 కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20,06,034కు పెరిగింది. ప్రస్తుతం 14,708 యాక్టివ్ కేసులున్నాయి. ఇకపోతే ఇప్పటి వరకు 2,75,36,639 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.

Tags:    

Similar News