మహమ్మారిని ‘జాతీయ విపత్తు’గా ప్రకటించండి : మహారాష్ట్ర సీఎం

ముంబయి : ఏడాదికాలంగా దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని ‘జాతీయ విపత్తు’గా ప్రకటించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. గురువారం ఆయన ముంబయిలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధానితో సమీక్ష సమావేశాల సందర్భంగా ఉద్దవ్ థాక్రే పలుమార్లు ఈ విషయాన్ని ప్రస్తావించడమే గాక లేఖలు కూడా రాశారని అన్నారు. సుప్రీంకోర్టు కూడా దీనిని పరిగణనలోకి తీసుకోవాలని రౌత్ కోరారు. జాతీయ విపత్తు ప్రకటిస్తే దేశానికి ఎంతో […]

Update: 2021-04-29 09:00 GMT

ముంబయి : ఏడాదికాలంగా దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని ‘జాతీయ విపత్తు’గా ప్రకటించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. గురువారం ఆయన ముంబయిలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధానితో సమీక్ష సమావేశాల సందర్భంగా ఉద్దవ్ థాక్రే పలుమార్లు ఈ విషయాన్ని ప్రస్తావించడమే గాక లేఖలు కూడా రాశారని అన్నారు.

సుప్రీంకోర్టు కూడా దీనిని పరిగణనలోకి తీసుకోవాలని రౌత్ కోరారు. జాతీయ విపత్తు ప్రకటిస్తే దేశానికి ఎంతో ప్రయోజనకరమని అన్నారు. అంతేగాక కరోనా కట్టడికి కేంద్రంతో పాటు మిగిలిన రాష్ట్రాలు ‘మహారాష్ట్ర మోడల్’ను అనుసరించాలని చెప్పారు. అయితే ఆ మోడల్ ఏంటనేదానిపై ఆయన వివరాలు వెల్లడించలేదు.

Tags:    

Similar News