నాలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు: కేంద్రం
కరోనా వైరస్‌పై రాజ్యసభలో కేంద్రమంత్రి హర్షవర్ధన్ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ, ఆగ్రా, రాజస్థాన్, తెలంగాణలో కేసులు నమోదయ్యాయని ఆయన గుర్తుచేశారు. వైరస్‌ను అడ్డుకునేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామన్నారు. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశామని తెలిపారు. ఇటలీ, చైనా, జపాన్ దేశాల్లో భారతీయులు పర్యటించ వద్దని హర్షవర్ధన్ ప్రజలకు సూచించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారి ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఓడరేవుల ద్వారా వచ్చేవారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అలాగే […]
కరోనా వైరస్‌పై రాజ్యసభలో కేంద్రమంత్రి హర్షవర్ధన్ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ, ఆగ్రా, రాజస్థాన్, తెలంగాణలో కేసులు నమోదయ్యాయని ఆయన గుర్తుచేశారు. వైరస్‌ను అడ్డుకునేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామన్నారు. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశామని తెలిపారు. ఇటలీ, చైనా, జపాన్ దేశాల్లో భారతీయులు పర్యటించ వద్దని హర్షవర్ధన్ ప్రజలకు సూచించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారి ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఓడరేవుల ద్వారా వచ్చేవారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అలాగే జపాన్, దక్షిణ కొరియా దేశస్తుల వీసాలను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నామన్నారు. అన్ని ఎయిర్‌పోర్టులల్లో స్ర్కీనింగ్ పరీక్షలు చేస్తున్నట్లు హర్షవర్థన్ వెల్లడించారు.
Tags: statement, coronavirus, rajya sabha, harshvardhan