లాక్‌డౌన్ పొడిగింపుపై 12న నిర్ణయం తీసుకుంటాం

రాయ్‌పూర్: లాక్‌డౌన్ పొడిగింపుపై ఈ నెల 12న నిర్ణయం తీసుకుంటామని ఛత్తీస్‌గడ్ సీఎం భూపేష్ బగేల్ తెలిపారు. ఏప్రిల్ 11న ప్రధాని మోడీ.. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాతే ఈ నిర్ణయం ఉంటుందని వివరించారు. ప్రధానితో మీటింగ్ తర్వాత రాష్ట్ర క్యాబినెట్ మంత్రులతో తాను వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించనున్నట్టు తెలిపారు. అటు తర్వాతే లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రధాని మోడీ ఇప్పుడు విధించిన లాక్‌డౌన్ ఉన్నపళంగా ఎవ్వరిని సంప్రదించకుండానే ప్రకటించారని, ఇప్పుడు ఈ […]

Update: 2020-04-09 07:34 GMT

రాయ్‌పూర్: లాక్‌డౌన్ పొడిగింపుపై ఈ నెల 12న నిర్ణయం తీసుకుంటామని ఛత్తీస్‌గడ్ సీఎం భూపేష్ బగేల్ తెలిపారు. ఏప్రిల్ 11న ప్రధాని మోడీ.. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాతే ఈ నిర్ణయం ఉంటుందని వివరించారు. ప్రధానితో మీటింగ్ తర్వాత రాష్ట్ర క్యాబినెట్ మంత్రులతో తాను వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించనున్నట్టు తెలిపారు. అటు తర్వాతే లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రధాని మోడీ ఇప్పుడు విధించిన లాక్‌డౌన్ ఉన్నపళంగా ఎవ్వరిని సంప్రదించకుండానే ప్రకటించారని, ఇప్పుడు ఈ విషయంపై రాష్ట్రాల సీఎంలతో చర్చించడం ఆహ్వానించదగినదని తెలిపారు.

Tags: chhattisgarh, cm bhupesh baghel, lockdown, extension, decision

Tags:    

Similar News