డీసీ కేసులో రూ.122 కోట్ల ఆస్తులు జప్తు

దిశ, వెబ్‌డెస్క్: మనీలాండరింగ్ కేసుకు సంబంధించి డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) మాజీ ప్రమోటర్లకు చెందిన రూ. 122.15 కోర్ విలువైన స్థిరాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలికంగా జప్తు చేసింది. డీసీహెచ్ఎల్ మాజీ ప్రమోటర్లైన టి వెంకట్రామ్ రెడ్డి, టి వినాయకరవి రెడ్డి నిందితులుగా ఉన్న ఈ కేసులో, మొత్తం రూ. 8,180 కోట్ల రుణాల విషయంలో మోసం చేసినట్టు ఆరోపణలున్నాయి. జప్తు చేసిన ఆస్తులు ఢిల్లీ, హైదరాబాద్, గుర్గావ్, చెన్నై, బెంగళూరులో మొత్తం 14 […]

Update: 2020-10-16 11:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: మనీలాండరింగ్ కేసుకు సంబంధించి డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) మాజీ ప్రమోటర్లకు చెందిన రూ. 122.15 కోర్ విలువైన స్థిరాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలికంగా జప్తు చేసింది. డీసీహెచ్ఎల్ మాజీ ప్రమోటర్లైన టి వెంకట్రామ్ రెడ్డి, టి వినాయకరవి రెడ్డి నిందితులుగా ఉన్న ఈ కేసులో, మొత్తం రూ. 8,180 కోట్ల రుణాల విషయంలో మోసం చేసినట్టు ఆరోపణలున్నాయి. జప్తు చేసిన ఆస్తులు ఢిల్లీ, హైదరాబాద్, గుర్గావ్, చెన్నై, బెంగళూరులో మొత్తం 14 స్థిరాస్తులు ఉన్నట్టు ఈడీ గుర్తించింది.

ఈ కేసులో ఇది రెండో అటాచ్‌మెంట్ అని, తాజా జప్తుతో కలిపి మొత్తం రూ. 264.56 కోట్లను జప్తు చేసినట్టు తెలుస్తోంది. ఈడీ ప్రకారం..డీసీహెచ్ఎల్‌కు చెందిన ముగ్గురు ప్రమోటర్లు పికె అయ్యర్, టి వెంకట్రామ్ రెడ్డి, టి వినాయకరవి రెడ్డిలు తప్పుడు పత్రాలతో బ్యాంకులకు వందల కోట్ల మోసానికి పాల్పడినట్టు ఆరోపణలొచ్చాయి. గతంలోనే సీబీఐ ఈ ముగ్గురిపై కేసును నమోదు చేసింది. అయితే, గతేడాది ఆగష్టులో బ్యాంకు మోసానికి సంబంధించి కంపెనీ కార్యకలాపాలపై ఈడీ దాడులు చేసింది.

Tags:    

Similar News