నీరుగారుతున్న పంట రుణలక్ష్యం

దిశ, న‌ల్ల‌గొండ‌: ఆరుగాలం శ్రమించే అన్నదాతకు ఇవ్వాల్సిన రుణాలు లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. ప్రతి ఖరీఫ్, రబీ సీజన్‌లో పాతబకాయిలతో సంబంధం లేకుండా రైతులకు రుణాలివ్వాల్సిందే అని సర్కారు బ్యాంకర్లను ఆదేశిస్తోంది. రుణ లక్ష్యం కచ్చితంగా అధిగమించాలని చెబుతోంది. అయినా బ్యాంకుల నుంచి రైతులకు సహకారం అందడం లేదు. వివిధ కారణాల వల్ల రైతులకు అందించే పంట రుణాలను బ్యాంకులు ఏటా తగ్గిస్తున్నాయి. లక్ష్యం రూ. 406.80 కోట్లు రబీ సీజన్ మ‌రో నెల రోజుల్లో ముగియ‌నుంది. […]

Update: 2020-03-04 01:05 GMT

దిశ, న‌ల్ల‌గొండ‌: ఆరుగాలం శ్రమించే అన్నదాతకు ఇవ్వాల్సిన రుణాలు లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. ప్రతి ఖరీఫ్, రబీ సీజన్‌లో పాతబకాయిలతో సంబంధం లేకుండా రైతులకు రుణాలివ్వాల్సిందే అని సర్కారు బ్యాంకర్లను ఆదేశిస్తోంది. రుణ లక్ష్యం కచ్చితంగా అధిగమించాలని చెబుతోంది. అయినా బ్యాంకుల నుంచి రైతులకు సహకారం అందడం లేదు. వివిధ కారణాల వల్ల రైతులకు అందించే పంట రుణాలను బ్యాంకులు ఏటా తగ్గిస్తున్నాయి.

లక్ష్యం రూ. 406.80 కోట్లు

రబీ సీజన్ మ‌రో నెల రోజుల్లో ముగియ‌నుంది. ఈ సీజన్‌లో వరి సహా ఇతర ఆరుతడి పంటలను రైతులు సాగు చేస్తున్నారు. యాదాద్రిభువ‌న‌గిరి జిల్లాలో 1.29 లక్షల ఎకరాల్లో పంట విస్తీర్ణం ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వాస్తవానికి పంటకు తొలిదశ నుంచి రైతులకు పెట్టుబడులు అవసరం. అందుకే రుణ లక్ష్యంగా రూ.406.80 కోట్లు నిర్ణయించారు. సీజన్ ప్రారంభమై నెల గడిచే వ‌ర‌కు బ్యాంక‌ర్లు ఇచ్చింది కేవలం 15 శాతం మంది రైతులకు మాత్రమే. మ‌రో నెల రోజుల్లో ర‌బీ ముగియ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు రూ.300 కోట్ల‌ రుణాలు పంపిణీ చేసిన‌ట్టు తెలుస్తోంది. సర్కారు నుంచి రుణమాఫీ రాక పోవడం వల్ల.. బ్యాంకుల్లో గత బకాయిలు అదే విధంగా ఉన్నాయి. రుణం కోసం వచ్చే రైతులను పాత బకాయిలు చెల్లించాలని బ్యాంకర్లు కోరుతున్నారు. దీంతో పాత బకాయిలు చెల్లించలేని రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు రైతులు మాత్రం రుణాలను రెన్యువల్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ రెన్యువల్‌ను కూడా రుణాలు ఇచ్చినట్టుగా బ్యాంకర్లు లెక్కలు చూపించుకుంటున్నారు.

ఖరీఫ్‌లో 70 శాతమే..

గడచిన ఖరీఫ్ సీజన్‌లోనూ పూర్తి స్థాయిలో రైతులకు బ్యాంకర్లు సహకారం అందించలేదు. దీంతో నిర్దేశించుకున్న రుణ ప్రణాళిక లక్ష్యం బ్యాంకులు సాధించలేదు. ఖరీఫ్‌ సీజన్‌లో 3.32 లక్షల ఎకరాల్లో రైతులు పంటలను సాగుచేశారు. ఈ సీజన్‌లో బ్యాంకుల నుంచి పంట రుణాలు అందించడానికి రూ.610.21 కోట్ల రుణ ప్రణాళికను ప్రకటించారు. దీని ప్రకారం పంట రుణాలు అందించాల్సి ఉంటుంది. 51192 మంది రైతులకు రూ. 444.10 కోట్లు రుణాలు ఇచ్చినట్టు బ్యాంకర్లు నివేదిక రూపొందించారు. కాగా వీరిలో ఎక్కువ మంది తమ రుణాలను రెన్యువల్ చేసుకున్నారని సమాచారం. తమకు బ్యాంకర్లు తమకు రుణాలు సరిగా ఇవ్వడం లేదని రైతులు చెబుతుండగా.. ఇప్పటికే బకాయిలుగా ఉన్నందున రైతులే రావడం లేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. గతంలో తీసుకున్న పంట రుణాలే చెల్లించక పోవడాన్ని దృష్టిలో పెట్టుకున్న కొందరు రైతులు వాటిని రెన్యువల్ చేసుకుంటున్నారు. పంట రుణాలు చెల్లిస్తే.. రుణమాఫీకి అర్హత కోల్పోతామన్న భయంతో మరికొందరు రైతులు చెల్లించడం లేదు. గతంలో తీసుకున్న రుణాలే చెల్లించనందున కొందరు రైతులు పంట రుణాల కోసం బ్యాంకుల వైపునకే వెళ్లడం లేదు. చివరకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ మరింత అప్పల పాలవుతున్నారు.

Tags: farmers, Debt crop loss, nalgonda district

Tags:    

Similar News