బీసీ కులాలకు నవంబర్ 17 డెడ్ లైన్

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ కులాలకు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 17 డెడ్ లైన్ విధించింది. కులసంఘాలు ఏక సంఘంగా ఏర్పడకపోతే మీ ఇష్టం అని పేర్కొనడంతో పాటు ఆత్మగౌరవ భవనాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని స్పష్టం చేసింది. కుల సంఘాల భవన నిర్మాణాలకు ఈ నెల 21, 22 తేదీల్లో కేటాయించిన భూమికి పట్టాలు ఇవ్వనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా భవనాల నిర్మాణ పనులు ప్రారంభం […]

Update: 2021-11-08 09:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ కులాలకు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 17 డెడ్ లైన్ విధించింది. కులసంఘాలు ఏక సంఘంగా ఏర్పడకపోతే మీ ఇష్టం అని పేర్కొనడంతో పాటు ఆత్మగౌరవ భవనాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని స్పష్టం చేసింది. కుల సంఘాల భవన నిర్మాణాలకు ఈ నెల 21, 22 తేదీల్లో కేటాయించిన భూమికి పట్టాలు ఇవ్వనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా భవనాల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండ్రోజుల పాటు ఆత్మగౌరవ భవనాలకు సంబంధించిన రాష్ట్రస్థాయి రిజిస్టర్డు కుల సంఘాల సమావేశాలను బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం బీసీ కుల సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. బీసీలను రాజ‌కీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 41 బీసీ కులాల‌కు కోకాపేట, ఉప్పల్ బ‌గాయ‌త్లో 82.30 ఎక‌రాలు కేటాయించామ‌న్నారు. మౌలిక స‌దుపాయాలు, భ‌వ‌న నిర్మాణం కోసం ఎక‌రాకు కోటి రూపాయ‌ల చొప్పున 95.25 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఏక సంఘంగా ఏర్పడిన కుల‌సంఘాలకు త‌క్షణ‌మే ప‌ట్టాలు అంద‌జేస్తామ‌న్నారు. ఏక సంఘంగా ఏర్పడడం సాధ్యం కాని ప‌రిస్థితుల్లో ఆయా కులాల‌ భ‌వ‌న నిర్మాణాల బాధ్యత‌ను ప్రభుత్వం తీసుకుంటుంద‌న్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలు సంఘ‌టితంగా ఏక‌మై ఏక సంఘంగా ఏర్పడి ఆత్మగౌర‌వ భ‌వ‌నాలను అద్బుతంగా నిర్మించుకోవాల‌న్నారు. మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మాట్లాడుతూ.. బీసీల ఆత్మగౌర‌వం పెంచేలా అంద‌రూ సంఘ‌టిత‌మై ఆత్మగౌర‌వ భ‌వ‌నాల్ని నిర్మించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్, బీసీ సంక్షేమ శాఖ‌ ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీ బుర్రావెంక‌టేశం, బీసీ సంక్షేమ శాఖ అధికారులు అలోక్ కుమార్,సైదా, బాలాచారి, సంధ్య, విమ‌ల‌, ఇత‌ర అధికారులు, బీసీ సంఘాల నేత‌లు పాల్గొన్నారు.

Tags:    

Similar News