‘దోస్త్’ సర్వర్ డౌన్

దిశ, న్యూస్‌బ్యూరో: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న దోస్త్ రిజిస్ట్రేషన్ల కోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం చివరి రోజు కావడంతో ఎక్కువ మంది రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ప్రయత్నించడంతో సర్వర్‌పై భారం పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 105హెల్ప్ లైన్ సెంటర్లతో పాటు, మీసేవ, పర్సనల్ కంప్యూటర్ల నుంచి రిజిస్ర్టేషన్ల కోసం ప్రయత్నించారు. దీంతో చాలామంది విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాలేదు. 2-3 గంటలు కోసం వేచి చూసినా ఫలితం కనిపించ లేదు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు ఈ నెల […]

Update: 2020-09-07 10:27 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న దోస్త్ రిజిస్ట్రేషన్ల కోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం చివరి రోజు కావడంతో ఎక్కువ మంది రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ప్రయత్నించడంతో సర్వర్‌పై భారం పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 105హెల్ప్ లైన్ సెంటర్లతో పాటు, మీసేవ, పర్సనల్ కంప్యూటర్ల నుంచి రిజిస్ర్టేషన్ల కోసం ప్రయత్నించారు. దీంతో చాలామంది విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాలేదు. 2-3 గంటలు కోసం వేచి చూసినా ఫలితం కనిపించ లేదు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు ఈ నెల 8 వరకూ పొడగిస్తున్నట్టు దోస్త్ కన్వీనర్ లింబాద్రి ప్రకటించారు. సర్వర్ బిజీ కావడంతో ఒక్క రోజులోనే రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు పూర్తి చేయడం సాధ్యం కాదని విద్యార్థులు, తల్లిదండ్రులు చెబుతున్నారు. మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్లకు మరికొన్ని రోజులు గడువు పెంచాలని వారు కోరుతున్నారు.

Tags:    

Similar News