అంబేద్కర్ వర్సిటీలో అడ్మిషన్ల గడువు పొడిగింపు
దిశ, క్రైమ్ బ్యూరో : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో అడ్మిషన్ల గడువును డిసెంబరు 31 వరకు పొడిగించినట్టు ఇంఛార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ జి.లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ ఏడాది డిగ్రీ కోర్సులు (బీఏ, బీకాం, బీఎస్సీ), పీజీ (ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ – ఐసెట్ ద్వారా, బీఎల్ఐఎస్సీ, ఎమ్ఎల్ఐఎస్సీ, పీజీ డిప్లొమా సర్టిపికెట్) కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉన్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ […]
దిశ, క్రైమ్ బ్యూరో : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో అడ్మిషన్ల గడువును డిసెంబరు 31 వరకు పొడిగించినట్టు ఇంఛార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ జి.లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ ఏడాది డిగ్రీ కోర్సులు (బీఏ, బీకాం, బీఎస్సీ), పీజీ (ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ – ఐసెట్ ద్వారా, బీఎల్ఐఎస్సీ, ఎమ్ఎల్ఐఎస్సీ, పీజీ డిప్లొమా సర్టిపికెట్) కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉన్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ స్టడీ సెంటర్స్లలో ఆయా కోర్సులలో చేరేందుకు విద్యార్హతలు, ఫీజు వివరాలు www.braouonline.in వెబ్ సైట్లో పొందుపర్చినట్లు వెల్లడించారు. ఇంటర్మీడియెట్, నేషనల్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్ పూర్తి చేసిన వారు, యూనివర్సిటీ నిర్వహించిన అర్హత పరీక్షల్లో 2016 నుంచి 2020 వరకు పాసైన విద్యార్థులు కూడా నేరుగా డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చని వివరించారు.
ఇప్పటికే అడ్మిషన్ పొంది ఉండి వివిధ కారణాలతో సకాలంలో ట్యూషన్ ఫీజు చెల్లించలేకపోయిన డిగ్రీ కోర్సు ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు, పీజీ కోర్సుల్లో చేరి అడ్మిషన్ ఫీజు సకాలంలో కట్టలేక పోయిన వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీటెక్ , బీఫార్మసీ కోర్సులు చదివిన విధ్యార్థులు కూడా ఓపెన్ వర్సిటీలో పీజీ కోర్సు ఎం.ఏ. పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ సోషియాలజీ, ఇంగ్లీష్, సైకాలజీ, జర్నలిజం కోర్సులలో అడ్మిషన్ పొందొచ్చని అన్నారు. మరిన్ని వివరాలకు 73829 29570/ 580 /590 /600 లేదా విశ్వవిద్యాలయం సమాచార కేంద్రం 040-2368 0333 / 555 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని అన్నారు.