విధులతో పాటే జీవితం ముఖ్యం.. అ జాగ్రత్త పనికిరాదు

దిశ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు విజృంభిస్తున్నందున వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సీపీ కమల్ హసన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు కూడా కరోనా పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. ఏ మాత్రం అ జాగ్రత్తగా ఉన్నా తమ జీవితాలను ఫణంగా పెట్టాల్సిన పరిస్థితి వస్తోందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. నిరంతరం జన సమూహాల్లో ఉండే […]

Update: 2020-07-12 06:32 GMT

దిశ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు విజృంభిస్తున్నందున వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సీపీ కమల్ హసన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు కూడా కరోనా పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. ఏ మాత్రం అ జాగ్రత్తగా ఉన్నా తమ జీవితాలను ఫణంగా పెట్టాల్సిన పరిస్థితి వస్తోందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. నిరంతరం జన సమూహాల్లో ఉండే పోలీసు యంత్రాంగం తప్పసిసరిగా మాస్కులు ధరించడమే కాకుండా, భౌతిక దూరం పాటించాలని స్పష్టంచేశారు. లేదంటే తదనంతరం ఎదురయ్యే ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. స్టేషన్లకు వచ్చిన ఫిర్యాదు దారుల విషయంలోనూ, మూకుమ్మడిగా జరిపే వేడుకల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీలైనంత వరకు ఎలాంటి వేడుకలకు హాజరు కాకుండా ఉండటమే బెటర్ అన్నారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి ఇచ్చిన విందులో పలువురు అస్వస్థకు గురయ్యారని, ఆయన కూడా మరణించిన విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకుని మసలుకోవాలని సీపీ కమలాసన్ రెడ్డి పోలీసు యంత్రాంగానికి పలు సూచనలు చేశారు.

Tags:    

Similar News