డీసీసీబీ చైర్మన్‌గిరీ ఎవరికి?

రైతు సహకార సేవా సంఘాల పోరులో టీఆర్ఎస్​ మద్దతుదారులు హవా కొనసాగించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 57 సొసైటీల్లో టీఆర్​ఎస్​- 49, కాంగ్రెస్​- 7, స్వతంత్రులు ఒకటి చొప్పున చైర్మన్​ పదవులను కైవసం చేసుకున్నారు. ఇక మిగిలింది డీసీసీబీ చైర్మన్​ఎన్నికే. ఆరుగురు అభ్యర్థులు డీసీసీబీ చైర్మన్ పదవికి పోటీపడుతుండగా వీరిలో రియల్​వ్యాపారి రేసులో ముందున్నట్లు సమాచారం. అయితే ఇంకా నోటిఫికేషన్​ వెలువడకపోవడంతో ఆశావహులు మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్​రెడ్డి, ఎంపీ రంజిత్​రెడ్డిలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. […]

Update: 2020-02-18 06:03 GMT

రైతు సహకార సేవా సంఘాల పోరులో టీఆర్ఎస్​ మద్దతుదారులు హవా కొనసాగించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 57 సొసైటీల్లో టీఆర్​ఎస్​- 49, కాంగ్రెస్​- 7, స్వతంత్రులు ఒకటి చొప్పున చైర్మన్​ పదవులను కైవసం చేసుకున్నారు. ఇక మిగిలింది డీసీసీబీ చైర్మన్​ఎన్నికే. ఆరుగురు అభ్యర్థులు డీసీసీబీ చైర్మన్ పదవికి పోటీపడుతుండగా వీరిలో రియల్​వ్యాపారి రేసులో ముందున్నట్లు సమాచారం. అయితే ఇంకా నోటిఫికేషన్​ వెలువడకపోవడంతో ఆశావహులు మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్​రెడ్డి, ఎంపీ రంజిత్​రెడ్డిలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పైగా చైర్మన్​రేసులో ఉన్నవారిలో ఐదుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే కావడం గమనార్హం. ఏదేమైనా, చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవంగానే ఉండాలంటూ టీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ ఇప్పటికే పార్టీ నాయకులను ఆదేశించినట్లు సమాచారం.

ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే ఎన్నిక..

పాత జిల్లా ప్రాతిపదికనే డీసీసీబీ చైర్మన్ ​ఎన్నిక జరగనుంది. మొదటగా కొత్త జిల్లాల ప్రాతిపాదికన డీసీసీబీ ఎన్నిక నిర్వహించాలని అభిప్రాయపడ్డినా, చివరి క్షణంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకొని పాత జిల్లాలోని సొసైటీ ప్రకారం ఎన్నికలు నిర్వహించారు. పాత జిల్లా ప్రకారం రంగారెడ్డిలో 28, వికారాబాద్​లో 20, మేడ్చల్​లో 9 సొసైటీల చొప్పున ఉన్నాయి. కొత్త జిల్లాల ప్రకారం రంగారెడ్డిలో 37, వికారాబాద్​లో 22, మేడ్చల్​9 సొసైటీలున్నాయి. అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నన్ని సొసైటీలే ఉన్నాయి. ​

ఐతే చైర్మన్.. లేకుంటే వైస్ చైర్మన్..

డీసీసీబీ చైర్మన్ ​పదవి దక్కకుంటే వైస్​ చైర్మన్ ​పదవినైనా దక్కించుకోవాలని ఆశావహులు పోటీ పడుతున్నారు. కుల్కచర్ల పీఏసీఎస్​ చైర్మన్‌గా ఎన్నికైన మనోహర్ రెడ్డి, బండ్లగూడ ఖల్సా పీఏసీఎస్‌ చైర్మన్‌గా పెంటారెడ్డి, పెద్దేముల్‌ మండలం ఘట్టేపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌గా ఎన్నికైన లక్ష్మారెడ్డిలతోపాటు ఆలూర్, చేవెళ్ల, శంషాబాద్ పీఏసీఎస్ ​చైర్మన్​ పదవులను దక్కించుకున్న​కృష్ణారెడ్డి, పోలీస్​ రాంరెడ్డి, బుర్కంట సతీష్‌లు​ కూడా ఇందుకోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో డీసీసీబీ చైర్మన్​ఎన్నికకు నోటిఫికేషన్​ వెలువడే అవకాశాలుండటంతో డీసీసీబీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసే పనిలో పడ్డారు.

Tags:    

Similar News