దళితులను మొదట్లోనే మోసం చేసిన కేసీఆర్
దిశ, దామరచర్ల: తెలంగాణలో దళితులను మోసం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ విమర్శలు చేశారు. శనివారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ యాత్ర’ నిర్వహించారు. ఈ యాత్రలో పాల్గొన్న శంకర్ నాయక్ మాట్లాడుతూ… దళిత బంధు పథకం కూడా మూడెకరాల భూమి లాంటిదే అని ఎద్దేవా చేశారు. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత దళితుడినే ముఖ్యమంత్రి […]
దిశ, దామరచర్ల: తెలంగాణలో దళితులను మోసం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ విమర్శలు చేశారు. శనివారం నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ యాత్ర’ నిర్వహించారు. ఈ యాత్రలో పాల్గొన్న శంకర్ నాయక్ మాట్లాడుతూ… దళిత బంధు పథకం కూడా మూడెకరాల భూమి లాంటిదే అని ఎద్దేవా చేశారు. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ మొదట్లోనే మోసం చేశారని గుర్తుచేశారు. ‘దళితబంధు’ కేవలం హుజురాబాద్ నియోజకవర్గానికే పరిమితం చేయకుండా.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోదిల శ్రీనివాస్, సర్పంచ్‌లు కిరణ్, రాంబాబు, గాజుల శ్రీనివాస్, జిల్లా ఎంపీటీసీ ఫోరం ప్రధాన కార్యదర్శి బెజ్జం సైదులు, కౌన్సిలర్ రవి నాయక్, డాక్టర్ సదానందం, ఆకారపు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.