కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోనున్న వార్నర్?

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల ఓపెనింగ్ బ్యాట్స్‌మాన్ డేవిడ్ వార్నర్ కొన్ని రోజుల పాటు క్రికెట్‌‌కు దూరంగా ఉండాలని అనుకుంటున్నాడు. గత సెప్టెంబర్ నుంచి కుటుంబానికి దూరంగా గడిపిన వార్నర్.. ఇప్పుడు ఆస్ట్రేలియాలోనే ఉన్నా.. టీమ్ ఇండియా సిరీస్ కోసం క్వారంటైన్‌లో ఉంటున్నాడు. ఇండియా సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు మరి కొన్ని సిరీస్‌లు ఆడనుంది. అంతే కాకుండా వచ్చే ఏడాది చివర్లో టీ20 వరల్డ్ కప్ కోసం ఇండియా కూడా రావల్సి ఉంది. […]

Update: 2020-11-24 09:13 GMT

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల ఓపెనింగ్ బ్యాట్స్‌మాన్ డేవిడ్ వార్నర్ కొన్ని రోజుల పాటు క్రికెట్‌‌కు దూరంగా ఉండాలని అనుకుంటున్నాడు. గత సెప్టెంబర్ నుంచి కుటుంబానికి దూరంగా గడిపిన వార్నర్.. ఇప్పుడు ఆస్ట్రేలియాలోనే ఉన్నా.. టీమ్ ఇండియా సిరీస్ కోసం క్వారంటైన్‌లో ఉంటున్నాడు. ఇండియా సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు మరి కొన్ని సిరీస్‌లు ఆడనుంది. అంతే కాకుండా వచ్చే ఏడాది చివర్లో టీ20 వరల్డ్ కప్ కోసం ఇండియా కూడా రావల్సి ఉంది.

ఆస్ట్రేలియాలో నిబంధనల ప్రకారం ఇంటికి వెళ్లాలంటే ముందు 14 రోజులు క్వారంటైన్‌లో గడపాలి. ప్రతీ సిరీస్ మధ్యలో రెండు వారాలు క్వారంటైన్‌లో ఉండి.. కుటుంబంతో కొన్ని రోజులే గడపాల్సిన పరిస్థితి వస్తున్నది. అంతే కాకుండా ప్రతీసారి బయోబబుల్‌లో ఉండటం వల్ల మానసికంగా కూడా కుంగిపోతున్నాడని తెలుస్తున్నది. దీంతో టీమ్ ఇండియాతో సిరీస్ అనంతరం కొన్ని సిరీస్‌లు ఆడకుండా కొన్నాళ్ల పాటు కుటుంబానికి పరిమితమవ్వాలని భావిస్తున్నాడని ఆస్ట్రేలియా మీడియాలో కథనాలు వచ్చాయి. 2021, 2022 టీ20 వరల్డ్ కప్‌లతో పాటు 2023లో ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ పైనే దృష్టి పెట్టాలని వార్నర్ భావిస్తున్నాడని మీడియా పేర్కొన్నది.

Tags:    

Similar News