సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ‘దవాదోస్త్’ ప్రారంభం

దిశ, తెలంగాణ బ్యూరో : రైల్వే ప్రయాణికులకు అత్యవసరమైన సమయంలో వైద్య సదుపాయాలను కల్పించాలనే లక్ష్యంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(secunderabad railway station)లో మెడికల్ రూమ్, జనరిక్ మెడిసిన్ ఔట్ లెట్ దవాదోస్త్ ప్రారంభించామని సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ అభయ్ కుమార్ గుప్తా తెలిపారు. గురువారం ఐఆర్ సీడీసీ సహకారంతో రైల్వే స్టేషన్ లోని వెయిటింగ్ హాల్ లో దవాదోస్త్ స్టాల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వేలో ప్రయాణికుల […]

Update: 2021-05-27 10:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రైల్వే ప్రయాణికులకు అత్యవసరమైన సమయంలో వైద్య సదుపాయాలను కల్పించాలనే లక్ష్యంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(secunderabad railway station)లో మెడికల్ రూమ్, జనరిక్ మెడిసిన్ ఔట్ లెట్ దవాదోస్త్ ప్రారంభించామని సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ అభయ్ కుమార్ గుప్తా తెలిపారు. గురువారం ఐఆర్ సీడీసీ సహకారంతో రైల్వే స్టేషన్ లోని వెయిటింగ్ హాల్ లో దవాదోస్త్ స్టాల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వేలో ప్రయాణికుల రద్దీ ఉండే సికింద్రాబాద్ స్టేషన్ లో స్టాల్ ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంతో రైల్వే ఎల్లప్పుడు ముందంజలో ఉంటుందన్నారు. మెడికల్ రూం, జనరిక్ మెడిసిన్ ఔట్ లెట్ మెస్సర్ దవాదోస్త్ ఫార్మా ప్రైవేటు లిమిటెడ్ నిర్వహిస్తారని, తగ్గింపు ధరలతో మందులు లభిస్తాయన్నారు. అనంతరం హౌజ్ కీపింగ్ సిబ్బంది, రైల్వే ఉద్యోగులకు కరోనా కిట్లను అందజేశారు. కార్యక్రమంలో రైల్వే, ఐఆర్ ఎస్డీసీ అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News