దాసరి కొడుకుపై చీటింగ్ కేసు.. ఫ్రీ పబ్లిసిటీ

దిశ, సినిమా : లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు కొడుకు అరుణ్ కుమార్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. అప్పు చెల్లించకుండా, కులం పేరుతో దూషించాడని నర్సింహులు వెంకటేష్ అనే వ్యక్తి కేసు పెట్టారు. దీంతో ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా ఈ విషయంపై స్పందించిన అరుణ్.. ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని చెప్తున్నాడు. పోలీసులకు కూడా ఇదే విషయం చెప్పానన్న ఆయన.. తెలియని […]

Update: 2021-08-18 09:02 GMT
dasari-arun-kumar
  • whatsapp icon

దిశ, సినిమా : లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు కొడుకు అరుణ్ కుమార్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. అప్పు చెల్లించకుండా, కులం పేరుతో దూషించాడని నర్సింహులు వెంకటేష్ అనే వ్యక్తి కేసు పెట్టారు. దీంతో ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా ఈ విషయంపై స్పందించిన అరుణ్.. ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని చెప్తున్నాడు. పోలీసులకు కూడా ఇదే విషయం చెప్పానన్న ఆయన.. తెలియని వ్యక్తికి డబ్బులు ఎలా ఇవ్వగలనని అన్నాడు. సదరు వ్యక్తి ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలియదన్న అరుణ్ కుమార్.. తనకు మాత్రం ఫ్రీ పబ్లిసిటీగా ఉపయోగపడుతుందని చెప్పడం విశేషం.

Tags:    

Similar News