ప్రమాదకరంగా NH 163.. ములుగు జిల్లాలో పట్టించుకోరా..?
దిశ, ములుగు: ములుగు జిల్లాలోని NH 163 ఇరువైపుల ముండ్ల పొదలతో ప్రమాదకరంగా మారింది. మల్లంపల్లి గ్రామం చివరి నుండి ములుగు గట్టమ్మ వరకు రోడ్డుకు ఇరు వైపున సుమారు అరమీటర్ మేర రహదారిపైకి విస్తరించాయి. పిచ్చి మొక్కలతో కూడిన ముళ్ళ కంచెలు రహదారి మీదికి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయినప్పటికీ, అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనే చర్చ జిల్లా కేంద్రంలో నడుస్తుంది. కేవలం మేడారం జాతర సమయంలో మాత్రమే రహదారికి మరమ్మత్తులు చేసి, […]
దిశ, ములుగు: ములుగు జిల్లాలోని NH 163 ఇరువైపుల ముండ్ల పొదలతో ప్రమాదకరంగా మారింది. మల్లంపల్లి గ్రామం చివరి నుండి ములుగు గట్టమ్మ వరకు రోడ్డుకు ఇరు వైపున సుమారు అరమీటర్ మేర రహదారిపైకి విస్తరించాయి. పిచ్చి మొక్కలతో కూడిన ముళ్ళ కంచెలు రహదారి మీదికి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయినప్పటికీ, అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనే చర్చ జిల్లా కేంద్రంలో నడుస్తుంది.
కేవలం మేడారం జాతర సమయంలో మాత్రమే రహదారికి మరమ్మత్తులు చేసి, ముళ్ళ పొదలను తొలగించడం తప్పా.. సాధారణ సమయంలో పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ములుగు జిల్లాలో పనిచేసే ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు ఈ జాతీయ రహదారి మీదుగానే ప్రయాణిస్తూ ఉంటారు. అటువంటి రోడ్డును పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత సమీక్షించే కంటే ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.