మూడేళ్లకే లైంగిక వేధింపులు ఎదుర్కొన్న దంగల్ బ్యూటీ

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్.. మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఉద్యోగం రావాలి అంటే సెక్స్ చేయాలన్న పరిస్థితులు కూడా ఎదుర్కొన్నానని.. ఒప్పుకోకపోతే అవకాశాలు చేజారిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపింది. తను మూడేళ్ల వయసు ఉన్నప్పుడే వేధింపులు ఎదుర్కొన్నట్లు చెప్పిన దంగల్ బ్యూటీ.. ఇప్పటికీ దీని గురించి మాట్లాడేందుకు మహిళల్లో భయం ఉందని చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో అయితే దాని గురించి మాట్లాడటమే తప్పుగా […]

Update: 2020-10-31 00:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్.. మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఉద్యోగం రావాలి అంటే సెక్స్ చేయాలన్న పరిస్థితులు కూడా ఎదుర్కొన్నానని.. ఒప్పుకోకపోతే అవకాశాలు చేజారిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపింది.

తను మూడేళ్ల వయసు ఉన్నప్పుడే వేధింపులు ఎదుర్కొన్నట్లు చెప్పిన దంగల్ బ్యూటీ.. ఇప్పటికీ దీని గురించి మాట్లాడేందుకు మహిళల్లో భయం ఉందని చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో అయితే దాని గురించి మాట్లాడటమే తప్పుగా భావిస్తారని.. కానీ నాకు నమ్మకం ఉంది, ఇప్పుడిప్పుడే దీనిపై అవగాహన కల్పిస్తున్నారని.. అమ్మాయిల భవిష్యత్తు బాగుంటుందని ఆశిస్తున్నానని తెలిపింది.

తను కూడా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదుర్కొన్నానని చెప్పిన ఫాతిమా.. తను ఒప్పుకోకపోతే ఎదుగుదలకు అడ్డుపడిన రోజులు కూడా ఉన్నాయని, సినిమాల్లో తన ప్లేస్‌లో మరొకరిని తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పింది. కాగా ప్రస్తుతం తను ‘లూడో, సూరజ్ పే మంగళ్ భరి’ సినిమాలు చేస్తోంది.

Tags:    

Similar News