ఫ్రీ వాటర్‌ స్కీమ్ కోసం కాల్ చేయండి: దాన కిషోర్

దిశ, సిటీ బ్యూరో: జీహెచ్ఎంసీలో ఫ్రీ వాటర్‌ స్కీమ్‌ అమలులో ఉన్నా.. ఇప్పటికీ పలువురు లబ్దిదారులు వివరాలను నమోదు చేసుకోలేదు. ఇటువంటి వారిని గుర్తించి అవగాహన కల్పించాలని జలమండలి ఎండీ దాన కిషోర్ అధికారులకు సూచించారు. ఈ పథకం అమలు, లబ్దిదారుల రిజిస్ట్రేషన్ అంశాలకు సంబంధించి ఆయన బుధవారం జలమండలి ప్రధాన కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాన కిషోర్ మాట్లాడుతూ.. ఫ్రీ వాటర్‌ స్కీమ్‌ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఏప్రిల్ మాసంలోనే గడువు […]

Update: 2021-07-14 08:53 GMT

దిశ, సిటీ బ్యూరో: జీహెచ్ఎంసీలో ఫ్రీ వాటర్‌ స్కీమ్‌ అమలులో ఉన్నా.. ఇప్పటికీ పలువురు లబ్దిదారులు వివరాలను నమోదు చేసుకోలేదు. ఇటువంటి వారిని గుర్తించి అవగాహన కల్పించాలని జలమండలి ఎండీ దాన కిషోర్ అధికారులకు సూచించారు. ఈ పథకం అమలు, లబ్దిదారుల రిజిస్ట్రేషన్ అంశాలకు సంబంధించి ఆయన బుధవారం జలమండలి ప్రధాన కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాన కిషోర్ మాట్లాడుతూ.. ఫ్రీ వాటర్‌ స్కీమ్‌ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఏప్రిల్ మాసంలోనే గడువు ముగిసినా.. వీలైనంత ఎక్కువ మంది లబ్ది పొందాలన్న ఉద్దేశ్యంతో వచ్చే నెల 15 వరకు గడువు పెంచామని వివరించారు. ఆగస్టు 15 తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని, ఇలాంటి వారికి మాత్రమే రిబేటు వర్తిస్తుందని చెప్పారు. ఎక్కువగా పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ స్కీమ్‌ గురించి అవేర్‌నెస్ కల్పించాలని దాన కిషోర్‌ అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, జలమండలి కస్టమర్ కేర్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ 155313ని సంప్రదించినా పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.

Tags:    

Similar News