వర్షానికి 2226 కిలోమీటర్ల రోడ్లు డ్యామేజ్​

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఇటీవల కురిసన వానలకు రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల గండ్లు పడి కొట్టుకుపోయాయి. మరికొన్ని రోడ్లు మొత్తం డ్యామేజ్​ అయ్యాయి. చాలా చోట్ల బీటలుబారిపోయాయి. రోడ్లతో పాటుగా నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద చేపట్టిన పలు పనులు వర్షాలతో ఆగమాగమయ్యాయి. వీటి మరమ్మతుల కోసం రూ. 357.31 కోట్లు కావాలని అధికారులు నివేదించారు. రోడ్ల ఉపరితల డ్యామేజ్​లో భాగంగా 2226.3 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతినగా.. వీటి కోసం రూ. 194.34 […]

Update: 2021-09-10 09:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఇటీవల కురిసన వానలకు రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల గండ్లు పడి కొట్టుకుపోయాయి. మరికొన్ని రోడ్లు మొత్తం డ్యామేజ్​ అయ్యాయి. చాలా చోట్ల బీటలుబారిపోయాయి. రోడ్లతో పాటుగా నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద చేపట్టిన పలు పనులు వర్షాలతో ఆగమాగమయ్యాయి. వీటి మరమ్మతుల కోసం రూ. 357.31 కోట్లు కావాలని అధికారులు నివేదించారు.

రోడ్ల ఉపరితల డ్యామేజ్​లో భాగంగా 2226.3 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతినగా.. వీటి కోసం రూ. 194.34 కోట్లు కావాలని అధికారులు లెక్క తేల్చారు. అదే విధంగా 11,256 కిలోమీటర్ల పరిధిలో రోడ్లకు గండ్లు పడ్డాయి. వీటి మరమ్మతులకు రూ. 8.65 కోట్లు అవసరమని అంచనా వేశారు. అదేవిధంగా 1,03,894 కిలోమీటర్ల పరిధిలో రోడ్లకు బీటలుబారాయి. కొంత మేరకు ఈ రోడ్లపై తారు కొట్టుకుపోయింది. వీటి కోసం రూ.6.13 కోట్లు అవసరమని నివేదికల్లో వెల్లడించారు. ఇక నియోజకవర్గ నిధుల కింద చేస్తున్న 651 పనులు డ్యామేజ్​ అయ్యాయని, వీటి కోసం రూ.148.17 కోట్లు కావాలని అధికారులు అంచనా వేశారు. మొత్తం రూ.357.31 కోట్లు అత్యవసరంగా విడుదల చేయాలని పేర్కొన్నారు. ఈ ఫైల్​ సీఎం అనుమతి కోసం పంపించారు.

Tags:    

Similar News