సిరిసిల్లలో సంచలనం.. కేటీఆర్ రాజీనామా చేయాలంటూ నిరసన.(వీడియో)
దిశ, సిరిసిల్ల : దళిత బంధు పథకాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో దళితులు నిరసనకు దిగారు. దళిత సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కేవలం ఎన్నికలు ఉన్నచోటే హామీలు ఇస్తూ, నిధులు ధారపోస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. మొదటి విడతలో దళిత బంధు పథకాన్ని అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించకపోతే దళితుల […]
దిశ, సిరిసిల్ల : దళిత బంధు పథకాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో దళితులు నిరసనకు దిగారు. దళిత సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కేవలం ఎన్నికలు ఉన్నచోటే హామీలు ఇస్తూ, నిధులు ధారపోస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు.
మొదటి విడతలో దళిత బంధు పథకాన్ని అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించకపోతే దళితుల ఓట్లను దండుకునేందుకే ఈ పథకం చేపట్టినట్లు అవుతుందని ఆరోపించారు. హుజురాబాద్లో మాత్రమే దళిత బంధును అమలు చేస్తే స్థానిక మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు దళిత బంధు పథకాన్ని సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా అమలు చేస్తారన్నారు.