ఇంటర్నెట్‌లోనే సగం జీవితం.. ఎంత సమయం కేటాయిస్తున్నారో తెలుసా?

దిశ, ఫీచర్స్: పల్లె వాసికైనా.. అమెరికా నివాసికైనా ఏ సందేహం వచ్చినా వెంటనే ‘గూగుల్’ సెర్చ్ చేయడం పరిపాటిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఆ సెర్చ్ ఇంజిన్‌లో ఏడాదికి 213.2 బిలియన్ గంటల (1.6 మిలియన్ సంవత్సరాలు) పాటు గడుపుతున్నారని జైరో అధ్యయనంలో వెల్లడైంది. గూగుల్ తర్వాత ఎక్కువమంది ఆన్‌లైన్‌లో సమయాన్ని వెచ్చించేది యూట్యూబ్. ఈ క్రమంలోనే దాదాపు 142.6 (1.1 మిలియన్ సంవత్సరాలు) బిలియన్ గంటల వీడియోలను ఏటా మనం చూస్తుండగా, సగటున దాదాపు 22 నిమిషాల […]

Update: 2021-08-31 21:13 GMT

దిశ, ఫీచర్స్: పల్లె వాసికైనా.. అమెరికా నివాసికైనా ఏ సందేహం వచ్చినా వెంటనే ‘గూగుల్’ సెర్చ్ చేయడం పరిపాటిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఆ సెర్చ్ ఇంజిన్‌లో ఏడాదికి 213.2 బిలియన్ గంటల (1.6 మిలియన్ సంవత్సరాలు) పాటు గడుపుతున్నారని జైరో అధ్యయనంలో వెల్లడైంది. గూగుల్ తర్వాత ఎక్కువమంది ఆన్‌లైన్‌లో సమయాన్ని వెచ్చించేది యూట్యూబ్. ఈ క్రమంలోనే దాదాపు 142.6 (1.1 మిలియన్ సంవత్సరాలు) బిలియన్ గంటల వీడియోలను ఏటా మనం చూస్తుండగా, సగటున దాదాపు 22 నిమిషాల పాటు ఆ స్ట్రీమింగ్ వెబ్‌సైట్ వీక్షిస్తున్నాం. మరి వీడియో చూసిన తర్వాత ఊరికే ఉంటామా అంటే.. సమస్య లేదు. ఆ వీడియో కంటెంట్ బాగుంటే వెంటనే రకరకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో స్నేహితులు, బంధువులతో పాటు ఇతర గ్రూపుల్లో షేర్ చేస్తుంటాం. ఆయా సోషల్ మీడియా వేదికల్లో ఫేస్‌బుక్ టాప్‌లో ఉంది. యూజర్స్ అక్కడ 44.6 బిలియన్ గంటలు టైమ్ స్పెండ్ చేస్తుండగా ట్విట్టర్‌లో 13.4 బిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 8.9 బిలియన్స్ హౌవర్స్ గడుపుతున్నట్లు వెల్లడైంది. ఇక గూగుల్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో గడిపిన సమయాన్ని కలిపితే 422 బిలియన్ గంటలవుతుంది. గూగుల్ కాకుండా యాండెక్స్(రష్యా), నావేర్(దక్షిణ కొరియా), బైదు(చైనా) వంటి సెర్చ్ ఇంజన్లు టాప్ 10లో నిలిచాయి. వీటితో పాటు, ఎక్స్‌వీడియోలను చూసేందుకు 6.5 బిలియన్ గంటలు వెచ్చిస్తున్నారు.

ఫేవరెట్ ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్ :

టైంపాస్ కాకపోయినా, జర్నీలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా… వెంటనే జేబులోంచి మొబైల్ ఓపెన్ చేసి ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సెర్చ్ చేస్తుంటాం. ఆ సమయంలో ఎక్కువగా మనం ఏ వెబ్‌సైట్స్‌కు వెళుతుంటాం? ‘మ్యూజిక్’ కాకుండా ఇంకేం ఉంటుంది అంటారా? మీరన్నది నిజమే. ప్రపంచవ్యాప్తంగా ఏడాదిలో 317.5 మిలియన్ గంటలు ‘స్పోటీఫై’లో ఉంటున్నారని జైరో తెలిపింది. అయితే ఒక్కో యూజర్ సగటున కేవలం 4:19 నిమిషాలు మాత్రమే అందులో ఉంటున్నారని అధ్యయనంలో తేలింది. ఏదీ ఏమైనా ఇది అగ్రస్థానంలో ఉండగా, సౌండ్‌క్లౌడ్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఇందులో 160.8 మిలియన్ గంటలు స్పెండ్ చేస్తున్నారు.

గేమింగ్ బాబులు :

ఈ రోజుల్లో నెట్‌లో మరో ప్రధాన కాలక్షేపం గేమింగ్ కాగా సగటున 16:43 నిమిషాల విజిట్ డ్యూరేషన్‌‌తో ఏటా 3 బిలియన్ గంటలు రాబ్లాక్స్ ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్స్‌లో గడుపుతున్నారు. ఈ క్రమంలో ఇది యూట్యూబ్‌, నావెర్, హులు వంటి దిగ్గజ సైట్లను సైతం వెనక్కి నెట్టింది. రాబ్లాక్స్ అనేది పిల్లలు లక్ష్యంగా ఉన్న గేమింగ్ సైట్ కాగా ఇందులో ఆటగాళ్లు విభిన్న ప్రపంచాలను అన్వేషించొచ్చు. ఇక దీని తర్వాత ప్లేస్‌లో ట్విచ్ ఉండగా, ఇది అమెరికన్ వీడియో లైవ్ స్ట్రీమింగ్ సర్వీస్. ఈస్పోర్ట్స్ పోటీల ప్రసారాలతో సహా వీడియో గేమ్ లైవ్ స్ట్రీమింగ్‌పై దృష్టి పెడుతుంది. అంతేకాదు ఇది సంగీత ప్రసారాలు, సృజనాత్మక కంటెంట్ సహా, రియల్ లైఫ్ స్ట్రీమ్‌లను అందిస్తుంది. ఇక ట్విచ్ అనేది అమెజాన్ అనుబంధ సంస్థ అన్నది తెలిసిన విషయమే.

ఓటీటీ :

ప్రస్తుత కాలంలో ఓటీటీలు ఎక్కువగా ప్రజలను ఆకర్షిస్తున్నాయి. అయితే స్పాటిఫై, యూట్యూబ్ లాగా ఆయా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో యూజర్స్ కంటెంట్‌ను చూడటానికి ఎంత సమయం కేటాయిస్తున్నారో సూచించవు. అయితే జైరో అధ్యయనం ప్రకారం నెట్‌ఫ్లిక్స్‌‌లో సగటున ఏటా 4.4 బిలియన్ గంటలు ఉంటుండగా, సగటు సందర్శన వ్యవధి కేవలం 9:49 నిమిషాలు మాత్రమే.

ఫుడ్ డెలివరీ :

మనిషి వినోదంతో పాటు ఆహారానికి కూడా అంతకుమించిన ప్రాధాన్యతనిస్తుంటాడు. ఈ క్రమంలో డోర్‌డ్యాష్ (DoorDash), ఉబర్ ఈట్స్, గ్రబ్‌హబ్ (GrubHub), జస్ట్ ఈట్ వంటి వెబ్‌సైట్లు కొవిడ్‌కు ముందు నుంచే కస్టమర్స్ ఆదరణ అందుకున్నాయి. ఆయా ఫుడ్ డెలివరీ వేదికల్లో 31-78 మిలియన్ గంటల మధ్య గడుపుతుండగా, సగటున 5- 7 నిమిషాల సమయం విజిట్ చేస్తున్నారు.

డేటింగ్ :

నూరేళ్లపాటు కలిసి జీవించే భాగస్వామిని కనుగొనేందుకు ఇంటర్నెట్ కూడా సాయపడుతుందని వేరే చెప్పనక్కర్లేదు. ఆయా డేటింగ్ సైట్ విజిటింగ్స్ చూస్తూనే ఆ విషయం తెలిసిపోతోంది. ఈ మేరకు టిండర్‌‌లో 232.5 మిలియన్ గంటలపాటు గడుపుతుండగా, టిండర్ వినియోగదారులు ప్రతి సందర్శనకు సగటున 10 నిమిషాలు గడుపుతున్నారు.

ప్రయాణ విషయానికి వస్తే 382.6 మిలియన్ గంటలతో బుకింగ్.కామ్ అగ్రస్థానంలో ఉండగా.. సమీప ప్రత్యర్థి ఎయిర్‌బిఎన్‌బిలో కేవలం 132.4 మిలియన్లే స్పెండ్ చేస్తున్నారు. ఇక ట్రిప్ అడ్వైజర్‌లో సెలవుల గురించి ఫిర్యాదు చేయడానికి 71.9 మిలియన్ గంటలు గడిపారు.

ఇంటర్నెట్‌లో మన సమయాన్ని ఎలా గడపాలని ఎంచుకుంటామో, అది మనలో ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైనది. ఈ ర్యాంక్స్, హౌవర్స్ కేవలం అంకెలు మాత్రమేనని, ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి తమకు ఇష్టమైన సైట్‌లో టైమ్ స్పెండ్ చేయాలని జైరో తెలిపింది.

* సంతోష్ ఓ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్. తన పని చేసుకుంటూనే.. ఘడియ ఘడియకోసారి సెల్‌ఫోన్ చెక్ చేసుకుంటుంటాడు.
* బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న కనిక అనే అమ్మాయి.. ఎందరిలో ఉన్నా ఫోన్‌లోనే తలమునకలై ఉంటుంది.
* 21 ఏళ్ల కుర్రాడు రాహుల్ నిత్యం హెడ్‌ఫోన్స్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు.
* ఇక దీపక్, రాములు విషయానికొస్తే ఏదో ఒక టాపిక్ గురించి గూగుల్‌ను జల్లెడ పడుతూ కనిపిస్తుంటారు.

వీళ్లే కాదు.. సెంచరీ చేరువలో ఉన్న తాత నుంచి ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేస్తున్న బుడ్డోడి వరకు ‘ఇంటర్నెట్’ ఓ కాలక్షేపంగా మారిపోయింది. సెల్‌ఫోన్, ల్యాపీ, సిస్టమ్స్‌లోనే సగం జీవితం గడిచిపోతోందంటే అతిశయోక్తి కాదేమో. ఇంతకీ ఇంటర్నెట్‌లో అందరూ ఏం చూస్తారు? ఏ వెబ్‌సైట్స్.. వరల్డ్ వైడ్ వెబ్ గమ్యస్థానాలుగా ఉన్నాయి? అనే సందేహం మీకు కలిగే ఉంటుంది. ఆ విషయాలపై ‘జైరో’ అనే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ అధ్యయనం చేయాలనుకుంది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ఎక్కువ గంటలు గడిపిన సోషల్ మీడియా సైట్స్, సెర్చ్ ఇంజన్లు, గేమింగ్ సైట్స్ వివరాలను అందించింది.

Tags:    

Similar News