ముంబైవాసులకు సముద్రుడి ‘రిటర్న్ గిఫ్ట్’

దిశ, ఫీచర్స్ : న్యూటన్ మూడో గమన సూత్రం ప్రకారం ఏ చర్యకైనా ఈక్వల్ రియాక్షన్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మానవుడు అభివృద్ధి పేరిట చేసుకుంటూ పోతున్న తప్పులు వినాశనానికి దారితీస్తుండగా.. మితిమీరిన ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి హాని కలిగిస్తూ సముద్రాలను కలుషితం చేస్తోంది. ఈ మేరకు మానవాళి ప్రకృతి విపత్తుల రూపంలో ఊహించని ముప్పును ఎదుర్కొంటుండగా.. తాజాగా అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాన్.. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర తీర ప్రాంతాలను వణికిస్తోంది. […]

Update: 2021-05-20 06:06 GMT

దిశ, ఫీచర్స్ : న్యూటన్ మూడో గమన సూత్రం ప్రకారం ఏ చర్యకైనా ఈక్వల్ రియాక్షన్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మానవుడు అభివృద్ధి పేరిట చేసుకుంటూ పోతున్న తప్పులు వినాశనానికి దారితీస్తుండగా.. మితిమీరిన ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి హాని కలిగిస్తూ సముద్రాలను కలుషితం చేస్తోంది. ఈ మేరకు మానవాళి ప్రకృతి విపత్తుల రూపంలో ఊహించని ముప్పును ఎదుర్కొంటుండగా.. తాజాగా అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాన్.. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర తీర ప్రాంతాలను వణికిస్తోంది. ఈ క్రమంలో ముంబైవాసులు వింత అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు. అక్కడి బీచ్‌లన్నీ పూర్తిగా చెత్తతో నిండిపోయి డంపింగ్ యార్డ్‌లను తలపిస్తున్నాయి.

ఇంతకీ ఈ చెత్త ఎక్కడ నుంచి వచ్చిందని అనుకుంటున్నారు? సముద్రం నుంచే. చాలా సంవత్సరాలుగా చెత్తను తనలోనే డంప్ చేస్తూ అక్కడి జలరాశులకు, పర్యావరణానికి హానిచేస్తున్నా మౌనంగానే భరించిన సముద్రం.. ఇన్ని రోజులుగా దాచుకున్న చెత్తను ఒక్కసారిగా విసిరి కొట్టింది. మనుషుల తప్పులను ఎత్తిచూపింది. ఇప్పుడు ముంబై బీచెస్‌లో కనిపిస్తున్న దృశ్యాలన్నీ పర్యావరణంపై పౌరుల స్పృహకు తార్కాణంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ముంబైలోని 7 బీచ్‌ల నుంచి సివిక్ మేనేజ్‌మెంట్ వర్కర్స్ 62,000 కిలోలకు పైగా చెత్తను కలెక్ట్ చేసినట్టు టీవోఐ నివేదిక వెల్లడించింది. కాగా ఈ పరిణామాలపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

‘ఇది కర్మ ఫలితం’ అని కొందరు కామెంట్ చేస్తుండగా.. పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ తనను తాను శుభ్రపరుచుకునేందుకు ప్రకృతి సొంత మార్గాలను వెతుక్కుంటుంది. ఈ క్రమంలోనే సముద్రంలో డంప్ చేసిన చెత్తంతా ‘తౌక్టే తుఫాన్’ ద్వారా ముంబై వాసులకు రిటర్న్ గిఫ్ట్‌గా అందింది. అయినా మనం గుణపాఠం నేర్చుకోం’ అంటూ మరొక నెటిజన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

 

Tags:    

Similar News