గత ఏడాదితో పోలిస్తే సైబర్ క్రైమ్ నేరాలు 60 శాతం పెరిగాయి: సీపీ మహేష్‌భగవత్
దిశ, ఎల్బీనగర్ : రాచకొండ పోలీస్ కమిషనరెట్ పరిధిలో గత ఏడాదితో పోలిస్తే సైబర్ క్రైమ్ నేరాలు 60 శాతం పెరిగాయని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. సోమవారం నాగోల్‌లోని ఓ పక్షన్‌హాల్‌లో వార్షిక క్రైమ్ నివేదికను ఆయన విడుదల చేశారు. అంతకు ముందు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పొయిన పోలీసులకు, మీడియా సిబ్బందికి శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం ఐపీఎస్‌లుగా ఎంపికైన భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి, క్రైమ్ డీసీపీ యాదగిరి, షీ టీమ్ డీసీపీ ఎస్.కే […]
దిశ, ఎల్బీనగర్ : రాచకొండ పోలీస్ కమిషనరెట్ పరిధిలో గత ఏడాదితో పోలిస్తే సైబర్ క్రైమ్ నేరాలు 60 శాతం పెరిగాయని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. సోమవారం నాగోల్‌లోని ఓ పక్షన్‌హాల్‌లో వార్షిక క్రైమ్ నివేదికను ఆయన విడుదల చేశారు. అంతకు ముందు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పొయిన పోలీసులకు, మీడియా సిబ్బందికి శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం ఐపీఎస్‌లుగా ఎంపికైన భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి, క్రైమ్ డీసీపీ యాదగిరి, షీ టీమ్ డీసీపీ ఎస్.కే సలీమాలకు మెమోంటాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాదితో పోలీస్తే నేరాలు ఘననీయంగా పెరిగాయని తెలిపారు.
పోలీసులు ఎప్పటికప్పడు నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ ఏడాదిలో మహిళలపై జరిగిన నేరాలలో 2,446 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. వరకట్న వేధింపులతో 17 మరణాలు సంభవించగా, 3 హత్యలు జరిగాయని తెలిపారు. 11 మంది మహిళలు హత్యకు గురయ్యారని తెలిపారు. 394 పోక్సో కేసలు నమోదు అయ్యాయన్నారు. 1403 గృహ హింస కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. 2021లో 93 డ్రగ్స్‌కేసులు నమోదు కాగా 175 మంది అరెస్ట్ చేసి, 33 మందిపై పీడీ యాక్ట్ నయోదు చేయడం జరిగిందన్నారు. 106 మానవ అక్రమ రవాణా కేసలు నమోదు కాగా 354 మంది నిందితులను అరెస్ట్ చేసి 55 మందిపై పీడీ యాక్డ్ నయోదు చేయడం జరిగిందన్నారు. గేమింగ్ యాక్ట్ కింద రూ. 1.50 కోట్లు స్వాధీనం చేసుకుని, 1,079 మందిని అరెస్ట్ చేశామన్నారు.
రాచకొండ పరిధిలో ఈ ఏడాది 2,615 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, 642 మంది రోడ్డు ప్రమాదాల ద్వారా మృతి చెందినట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 580 మందికి జైలు శిక్ష పడడంతో పాటు రూ. 2.023 కోట్ల జరిమానాలు విధించడం జరిగిందన్నారు. ఆపరేషన్ స్మైల్ అండ్ అపరేషన్ ముస్కాన్ ద్వారా 459 మంది చిన్నారులను రెస్క్యూ(కాపాడాయన్నారు) చేశామన్నారు. 15.33 లక్షల హెల్మెట్ ధరించని వారిపై కేసులు నమోదు చేశామన్నారు. కోడి పందేలకు పాల్పడుతున్న 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ ద్వారా 1360 కేసులు నమోదు కాగా 116 మంది నిందితులను అరెస్ట్ చేసి రూ. 2.02 కోట్లు రికవరీ చేసి, 3.8 కోట్లు బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్‌బాబు, ఎల్బీనగర్ జోన్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, మల్కాజ్‌గిరి డీసీపీ రక్షిత కే మూర్తి, ట్రాఫిక్ డీసీపీ డి. శ్రీనివాస్, ఎస్వోటీ డీసీపీ సురేందర్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎసీపీ శ్రీధర్‌రెడ్డి, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.