సైబర్ వల.. జాగ్రత్త జర!
దిశ, మెదక్: హలో…! ‘ముఖ్యమంత్రి సహాయ నిధి’ విభాగం నుండి మాట్లాడుతున్నాము.. మీ ఖాతాలో రూ.1500 జమ అయ్యాయా..? అంటూ సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో వల విసురుతున్నారు. ఈ నేపథ్యంలో మీరు అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. సైబర్ నేరగాళ్లు ఈ తరహాలో మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా లేకుంటే మీ బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ అవడం ఖాయం. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటికే సైబర్ నేరగాళ్లు ఇలాంటి మోసాలకు ప్రయత్నాలు చేస్తున్నారు. […]
దిశ, మెదక్: హలో…! ‘ముఖ్యమంత్రి సహాయ నిధి’ విభాగం నుండి మాట్లాడుతున్నాము.. మీ ఖాతాలో రూ.1500 జమ అయ్యాయా..? అంటూ సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో వల విసురుతున్నారు. ఈ నేపథ్యంలో మీరు అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. సైబర్ నేరగాళ్లు ఈ తరహాలో మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా లేకుంటే మీ బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ అవడం ఖాయం.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటికే సైబర్ నేరగాళ్లు ఇలాంటి మోసాలకు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే ఇలాంటి ఫోన్ కాల్స్ తో పలువురు మోసపోయినట్లు తెలుస్తున్నది. పోలీస్ యంత్రాంగం సైబర్ నేరగాళ్ల మోసాలపై దృష్టి సారించింది. అయినా నేరగాళ్లు అప్పటికప్పుడు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో పోలీస్ యంత్రాంగం సైబర్ నేరగాళ్లు ఎప్పుడు, ఎక్కడ, ఏ తరహాలో విరుచుకు పడతారోనని ముందస్తు జాగ్రత్తలు చేపట్టినా నేరగాళ్ల వలకు ప్రజలు చిక్కుకుంటూనే ఉన్నారు. ఈ సందర్భంలో పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నా ప్రజలు సైబర్ నేరగాళ్ల మోసాలకు గురవుతూనే ఉన్నారు.
సైబర్ నేరగాళ్లు ఈ విధంగా మీకు ఫోన్ చేసి రూ.1500 మీ ఖాతాలో జమ చేస్తాము మీ ఖాతా వివరాలు, ATM కార్డ్ నెంబర్, OTP చెప్పమని అడగవచ్చు.. లేదా కొద్దిపాటి రుసుము మీ గూగుల్ పే, ఫోన్ పే ద్వారా చెల్లించమని గానీ, నీలిరంగు లింకులను క్లిక్ చేయమని చెప్పవచ్చు. ఈ విధంగా అపరిచితుల నుండి వచ్చే ఫోన్ కాల్స్ ను నమ్మవద్దు.. మీ వ్యక్తి గత వివరాలు, సమాచారం ఎవరికీ ఇవ్వొద్దు అని పోలీసు సూచిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.1500 రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు మాత్రమే అని గమనించాలి.. అవి నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతాయని పోలీసులు సూచిస్తున్నారు.
Tags: Cyber criminals, police, bank account, money, fake phone calls, corona effect