నగ్నంగా చాటింగ్.. అడ్డంగా బుక్కైన ఈవెంట్ మేనేజర్
దిశ, వెబ్ డెస్క్: దేశంలో సైబర్ నేరగాళ్ల రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. పక్క ప్లాన్ చేసి అమాయకులను మోసం చేసి డబ్బులు గుంజుతున్నారు. ఇలాంటి నేరాలపై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్న ఎవరో ఒకరు సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. తాజాగా ఒక ఈవెంట్ మేనేజర్ సైబర్ మోసగాళ్ల వలలో పడి రూ. 10 లక్షలు చెల్లించిన ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది. తార్నాక ప్రాంతానికి చెందిన ఒక ఈవెంట్ మేనేజర్ […]
దిశ, వెబ్ డెస్క్: దేశంలో సైబర్ నేరగాళ్ల రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. పక్క ప్లాన్ చేసి అమాయకులను మోసం చేసి డబ్బులు గుంజుతున్నారు. ఇలాంటి నేరాలపై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్న ఎవరో ఒకరు సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. తాజాగా ఒక ఈవెంట్ మేనేజర్ సైబర్ మోసగాళ్ల వలలో పడి రూ. 10 లక్షలు చెల్లించిన ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది. తార్నాక ప్రాంతానికి చెందిన ఒక ఈవెంట్ మేనేజర్ కి ఫేస్ బుక్ లో ఒక యువతీ పరిచయమయ్యింది. ఆ పరిచయం కాస్తా పెరిగి వాట్స్ అప్ చాటింగ్ వరకు వచ్చింది.
ఇక దీంతో సైబర్ నేరగాళ్ల రంగ ప్రవేశం చేశారు. బాధితుడికి నగ్న వీడియోలను షేర్ చేస్తూ బుట్టలో వేసుకున్నారు. ఆ తర్వాత బాధితుడి నగ్న వీడియోలను చిత్రీకరించారు. ఆ వీడియోలను చూపి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. మేము అడిగినంత ఇవ్వకపోతే ఈ వీడియోలను యూట్యూబ్ లో పెడతామని బెదించారు. దీంతో పరువు కోసం బాధితుడు వాళ్లకు రూ. 10 లక్షలు ముట్టచెప్పాడు. అక్కడితో ఆగకుండా రెండో ధపా మరో రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక అంత ఇచ్చుకునే స్తోమత లేని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.