లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: (సదస్సులు - నివేదికలు, స్పోర్ట్స్)
అమెరికా - భారత్ చాంబర్ ఆఫ్ కామర్స్ (యూఎస్ఏఐసీ) సదస్సు
సదస్సులు- నివేదికలు:
అమెరికా - భారత్ చాంబర్ ఆఫ్ కామర్స్ (యూఎస్ఏఐసీ) సదస్సు:
ఆధారాలతో కూడిన శాస్త్రీయ పరిశోధనలపై దృష్టి సారించాలని, వాటి విషయంలో భాగస్వామ్యాలు పెంచాలని భారత్ తరఫున జీ 20 షెర్పాగా వ్యవహరిస్తున్న అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. దీనివల్ల ఆరోగ్య వ్యవస్థల్లో సన్నద్ధతను పెంపొందించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. సంక్షోభ సమయాల్లో తక్షణ సేవలు అందించడానికి వీలుగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలను తీర్చిదిద్దాలని కోరారు.
పౌరులకు ఆరోగ్య భద్రతను అందించేలా పటిష్ట వ్యవస్థలను తీర్చిదిద్దే బాధ్యత జీ 20 సభ్య దేశాలపై ఉందని తెలిపారు. అమెరికా - ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ (యూఎస్ఏఐసీ) సదస్సును ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన అన్నారు. జి20 కూటమికి సంబంధించి భారత్ ఖరారు చేసిన ఒకే పుడమి- ఒకే కుటుంబం- ఒకే భవిత అనే ఇతివృత్తాన్ని జీ7 దేశాలకు చెందిన అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు సమర్ధించారు.
మిషన్ అంత్యోదయ సర్వే :
ఈ సర్వే ప్రకారం పల్లెలు ఇప్పటికీ ఆధునిక వసతుల విషయంలో వెనుకంజలో ఉన్నట్లు అంత్యోదయ సర్వే - 2020 నివేదిక చెబుతోంది. గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రజలకు అవసరమైన మౌలిక సౌకర్యాల కొరత భారీగానే ఉంది. ముఖ్యంగా కమ్యూనిటీ, ప్రాథమిక, ఉప ఆరోగ్య కేంద్రాలు, పశు వైద్య కేంద్రాలు అవసరమైనంత సంఖ్యలో లేవు. ఏటీఎం కేంద్రాలు, డిగ్రీ కాలేజీలు, వయోజన విద్యా కేంద్రాలు, గ్రంథాలయాలు ఇదే రీతిలో ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలు 93.78 శాతం గ్రామీణ ప్రంతాల్లోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 2,69,943 గ్రామ పంచాయతీలకు గాను 99 శాతం గ్రామాల్లో సర్వే నిర్వహించారు.
స్పోర్ట్స్ :
బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో సాత్విక్ జోడీకి 5వ ర్యాంకు:
ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో చరిత్రాత్మక డబుల్స్ స్వర్ణం గెలిచిన రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్‌శెట్టి కెరీర్‌లో మళ్లీ ఉత్తమ ర్యాంకు సాధించారు. బీడబ్ల్యూఎఫ్ తాజా ర్యాంకింగ్స్‌లో సాత్విక్ ద్వయం అయిదో ర్యాంకులో నిలిచింది.
టెస్టు క్రికెట్‌లో భారత్ నెం.1:
టెస్టు క్రికెట్లో టీమ్ ఇండియా మళ్లీ నంబర్‌వన్‌గా నిలిచింది. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఐసీసీ ప్రకటించిన వార్షిక ర్యాంకింగ్స్ జాబితాలో 121 రేటింగ్ పాయింట్లతో భారత్ నంబర్‌వన్ స్థానం సాధించింది.
ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్:
1వ స్థానం - భారత్
రెండో స్థానం - ఆసీస్
మూడో స్థానం - ఇంగ్లాండ్
టి20 ర్యాంకింగ్స్:
మొదటి స్థానం - భారత్
రెండో స్థానం - ఇంగ్లాండ్
మూడవ స్థానం - న్యూజిల్యాండ్
నాలుగో స్థానం - పాకిస్థాన్
ఇవి కూడా చదవండి: