ఈ ఏడాది మరిన్ని కొత్త మోడళ్లను తెచ్చే యోచనలో రాయల్ ఎన్‌ఫీల్డ్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రీమియం మోటార్‌సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదివరకూ ఎన్నడూ లెనన్ని ఎక్కువ సంఖ్యలో కొత్త బైకులను తీసుకురానున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఈ కొత్త మోడళ్లను తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలిపింది. ‘ఈ ఏడాది కొత్త బైకులను తీసుకురావడం ద్వారా ఒక ఏడాదిలో ఇన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులను తీసుకురావడం ఇదే తొలిసారి అవ్వొచ్చు. వినియోగదారుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని కొత్త మోడళ్లను […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రీమియం మోటార్‌సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదివరకూ ఎన్నడూ లెనన్ని ఎక్కువ సంఖ్యలో కొత్త బైకులను తీసుకురానున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఈ కొత్త మోడళ్లను తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలిపింది. ‘ఈ ఏడాది కొత్త బైకులను తీసుకురావడం ద్వారా ఒక ఏడాదిలో ఇన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులను తీసుకురావడం ఇదే తొలిసారి అవ్వొచ్చు.
వినియోగదారుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని కొత్త మోడళ్లను తీసుకురావడం సంతోషంగా ఉందని’ రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓ వినోద్ కె దాసరి చెప్పారు. కంపెనీ ఇదివరకే కరోనా ఉన్నప్పటికీ ప్రతి త్రైమాసికానికి ఒక మోడల్‌ను తీసుకురానున్నట్టు ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు. కొత్త మోడళ్లను తీసుకురావడంపై ప్రస్తుతం తీవ్రంగా కృషి చేస్తున్నామని ఐషర్ మోటార్స్ ఎండీ, సీఈఓ సిద్ధార్థ లాల్ తెలిపారు.
ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడళ్ల శ్రేణిలో మీటియర్, ఇంటర్‌సెప్టార్, కాంటినెంటల్ జీటీ, హిమాలయన్, క్లాసిక్, బుల్లెట్ వాహనాలు ఉన్నాయి. కొత్తగా రాబోయే మోడళ్లు సంస్థను అంతర్జాతీయ విస్తరణకు అనుగుణంగా ఉంటాయని వినోద్ కె దాసరి వివరించారు. మొత్తం దేశీయంగానే కాకుండా 50 దేశాలకు వాహనాలను ఎగుమతి చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, సరఫరా సమస్యలను అధిగమిస్తామని, ఈ ఏడాది నెలకు లక్ష యూనిట్లను సాధించగలమని ఆయన వెల్లడించారు.