రహదారిపై కరెన్సీ కలకలం..

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని జాతీయ రహదారిపై కరెన్సీ కలకలం సృష్టించింది. అటుగా వెళ్తున్న స్థానికులకు భారీ మొత్తంలో నగదు లభ్యమైనట్లు సమాచారం. దాని విలువ సుమారు రూ.10లక్షల మేర ఉంటుందని పలువురు అనుమానిస్తున్నారు. అది కూడా రూ.500 నోట్ల రూపంలో లభ్యమైనట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే, వడ్రవన్నూరు శివారులో గుర్తు తెలియని వ్యక్తులు ఆ నగదును పడేయగా.. బొమ్మకపల్లి, 74 ఉడేగోళం గ్రామస్తులు ఆ నోట్ల కట్టలను ఏరుకున్నారు. దీనిపై […]

Update: 2020-08-26 23:39 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని జాతీయ రహదారిపై కరెన్సీ కలకలం సృష్టించింది. అటుగా వెళ్తున్న స్థానికులకు భారీ మొత్తంలో నగదు లభ్యమైనట్లు సమాచారం. దాని విలువ సుమారు రూ.10లక్షల మేర ఉంటుందని పలువురు అనుమానిస్తున్నారు. అది కూడా రూ.500 నోట్ల రూపంలో లభ్యమైనట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.

అయితే, వడ్రవన్నూరు శివారులో గుర్తు తెలియని వ్యక్తులు ఆ నగదును పడేయగా.. బొమ్మకపల్లి, 74 ఉడేగోళం గ్రామస్తులు ఆ నోట్ల కట్టలను ఏరుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అంతపెద్ద మొత్తంలో నగదును రహదారిపై ఎవరు పడేశారని ఆరా తీయడంతో పాటు.. అది నకిలీ కరెన్సీనా? అన్నకోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News