ఏపీలో కర్ఫ్యూ వేళలు సడలింపు..

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కట్టడిలో భాగంగా ఏపీలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. అయితే జూన్ 30 వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ.. నిబంధనలను సడలిస్తున్నట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తున్నట్టు వెల్లడించారు. అలాగే సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలకు అనుమతిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు రెగ్యులర్ టైమింగ్స్ కొనసాగనున్నాయి. అయితే.. జూన్ 20వ తేదీ తర్వాత నుంచి కర్ఫ్యూ […]

Update: 2021-06-18 01:59 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కట్టడిలో భాగంగా ఏపీలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. అయితే జూన్ 30 వరకు కర్ఫ్యూను పొడిగిస్తూ.. నిబంధనలను సడలిస్తున్నట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తున్నట్టు వెల్లడించారు. అలాగే సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలకు అనుమతిస్తున్నట్టు పేర్కొన్నారు.

ప్రభుత్వ కార్యాలయాలకు రెగ్యులర్ టైమింగ్స్ కొనసాగనున్నాయి. అయితే.. జూన్ 20వ తేదీ తర్వాత నుంచి కర్ఫ్యూ సడలింపులు అమలులోకి రానున్నట్టు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కొవిడ్ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఉండనున్నట్టు అధికారులు తెలిపారు.

 

Tags:    

Similar News