‘ధోనీ ఏ సమస్యనైనా పరిష్కరించుకోగలడు’

దిశ, స్పోర్ట్స్: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు ఎలాంటి సమస్య వచ్చినా కెప్టెన్ ధోనీ పరిష్కరించుకోగలడని టీమ్ ఇండియా దిగ్గజ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందే జట్టులో నుంచి స్టార్ బ్యాట్స్‌మాన్ సురేష్ రైనా, స్పిన్నర్ హర్భజన్ సింగ్ తప్పుకోవడం జట్టుకు పెద్ద ఎదురు దెబ్బగా నిలిచింది. మూడో నెంబర్‌లో కీలకమైన బ్యాట్స్‌మెన్ తప్పుకోవడం సీఎక్కేకు పెద్ద సమస్యే. ఈ నేపథ్యంలో క్రిష్ స్పందిస్తూ… ‘చెన్నై జట్టు కచ్చితంగా సురేష్ రైనా […]

Update: 2020-09-14 08:30 GMT

దిశ, స్పోర్ట్స్: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు ఎలాంటి సమస్య వచ్చినా కెప్టెన్ ధోనీ పరిష్కరించుకోగలడని టీమ్ ఇండియా దిగ్గజ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందే జట్టులో నుంచి స్టార్ బ్యాట్స్‌మాన్ సురేష్ రైనా, స్పిన్నర్ హర్భజన్ సింగ్ తప్పుకోవడం జట్టుకు పెద్ద ఎదురు దెబ్బగా నిలిచింది. మూడో నెంబర్‌లో కీలకమైన బ్యాట్స్‌మెన్ తప్పుకోవడం సీఎక్కేకు పెద్ద సమస్యే. ఈ నేపథ్యంలో క్రిష్ స్పందిస్తూ…

‘చెన్నై జట్టు కచ్చితంగా సురేష్ రైనా సేవలను కోల్పోయినట్లే. రైనా లేకపోవడం జట్టుకు పెద్ద లోటు. అతడు ధోనీకి అండగా ఉంటూ వైస్ కెప్టెన్‌గా సేవలందిస్తున్నాడు. బ్యాట్‌తోనే కాకుండా బౌలింగ్ కూడా చేయగల సత్తా ఉంది. గ్రౌండ్‌లో అత్యుత్తమ ఫీల్డర్. అలాంటి వ్యక్తి లేకపోవడం పెద్ద సమస్య. మరోవైపు స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై హర్భజన్ సేవలు ఎంతో ముఖ్యం. వీరిద్దరూ లేకపోవడం సీఎస్కే జట్టుకు బలహీనతగా మారవచ్చు. కానీ మహీకి ఏ సమస్యనైనా పరిష్కరించుకోగలిగే సత్తా ఉంది’ అని శ్రీకాంత్ చెప్పాడు.

Read Also..

‘టీమిండియా తర్వాతి కెప్టెన్ కేఎల్ రాహుల్’

Full View

Tags:    

Similar News