చెన్నై సూపర్ కింగ్స్ కొత్త స్పాన్సర్ స్కోడా
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైన నాటి నుంచి జయాపజయాలతో సంబంధం లేకుండా అత్యధిక బ్రాండ్ వాల్యూ సంపాదిస్తున్న జట్టు చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే. మూడు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచి, ప్రతీ ఏడాది ప్లేఆఫ్స్‌కు చేరుతున్న ధోనీ సారధ్యంలోని ఈ జట్టుకు ప్రతీ ఏడాది స్పాన్సర్లు క్యూ కడుతుంటారు. అయితే యూఏఈలో జరిగిన 13వ సీజన్‌లో పేలవ ప్రదర్శనతో ఆ జట్టు కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేకపోయింది. ఒకానొక దశలో […]
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైన నాటి నుంచి జయాపజయాలతో సంబంధం లేకుండా అత్యధిక బ్రాండ్ వాల్యూ సంపాదిస్తున్న జట్టు చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే. మూడు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచి, ప్రతీ ఏడాది ప్లేఆఫ్స్‌కు చేరుతున్న ధోనీ సారధ్యంలోని ఈ జట్టుకు ప్రతీ ఏడాది స్పాన్సర్లు క్యూ కడుతుంటారు. అయితే యూఏఈలో జరిగిన 13వ సీజన్‌లో పేలవ ప్రదర్శనతో ఆ జట్టు కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేకపోయింది. ఒకానొక దశలో పాయింట్ల పట్టికలో అట్టడుగ ఉన్న ఆ జట్టు చివర్లో విజయాలు సాధించి ఊరట పొందింది. కాగా, ఇప్పుడు ఐపీఎల్ 14వ సీజన్‌కు రంగం సిద్దమైంది. గత మూడు సీజన్లుగా ఈ జట్టుకు టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ తమ బంధాన్ని తెంపుకున్నది.
ప్రతీ సీజన్‌లో రూ. 65 కోట్ల చొప్పున చెల్లించి ఆ హక్కులను పొందింది. అంతకు ముందు ముత్తూట్ ఫైనాన్స్ సీఎస్కేకు ప్రధాన స్పాన్సర్‌గా కూడా వ్యవహరించింది. అయితే ఈ సీజన్‌లో టైటిల్ స్పాన్సర్‌గా ముత్తూట్ ఫైనాన్స్ తప్పుకున్నది. దీంతో ఫ్రాంచైజీ యాజమాన్యం కొత్త స్పాన్సర్‌ను వెతికింది. రాబోయే 14వ సీజన్‌కు స్కోడా ఆటో టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనున్నది. అయితే ఎంత మొత్తానికి ఈ ఒప్పందం కుదిరిందనే విషయాన్ని మాత్రం యాజమాన్యం వెల్లడించలేదు. యూరోప్‌కు చెందిన స్కోడా ఆటో.. ఇండియాలో ప్రీమియర్ కార్లను విక్రయిస్తున్నది.