అక్టోబర్​ 10లోపు రైతు వేదికల నిర్మాణం

దిశ, న్యూస్​బ్యూరో: అక్డోబర్​ 10లోపు రైతు వేదికల నిర్మాణాలను పూర్తి చేయాలని సీఎస్​ సోమేష్​ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం విలీన గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించాలని, అభివృద్ధిపై కలెక్టర్లు వ్యక్తిగతంగా పరిశీలించాలని ఆదేశించారు. అంటువ్యాధుల నివారణకు శానిటేషన్ తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని 17జిల్లాలకు అదనపు కలెక్టర్ల నియామకంతో మొత్తం 29 మంది అదనపు కలెక్టర్లను స్థానిక వ్యవహారాలను పర్యవేక్షించేందుకు […]

Update: 2020-07-15 10:05 GMT

దిశ, న్యూస్​బ్యూరో: అక్డోబర్​ 10లోపు రైతు వేదికల నిర్మాణాలను పూర్తి చేయాలని సీఎస్​ సోమేష్​ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం విలీన గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించాలని, అభివృద్ధిపై కలెక్టర్లు వ్యక్తిగతంగా పరిశీలించాలని ఆదేశించారు. అంటువ్యాధుల నివారణకు శానిటేషన్ తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని 17జిల్లాలకు అదనపు కలెక్టర్ల నియామకంతో మొత్తం 29 మంది అదనపు కలెక్టర్లను స్థానిక వ్యవహారాలను పర్యవేక్షించేందుకు నియమించిన నేపథ్యంలో ఈ వీడీయో కాన్పరెన్స్​ నిర్వహించారు. మున్సిపాలిటీల్లో పారిశుధ్య కార్యక్రమాలపై, యాంటీ లార్వా, క్రిమి సంహారక స్ర్పేయింగ్​, వెక్టర్ బర్న్ వ్యాధుల నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి కొనసాగిస్తూ మరింత విస్తృతంగా చేపట్టాలన్నారు. వీటితో పాటు రైతు బంధు, కల్లాల నిర్మాణం, గోడౌన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల కోసం స్థలాల ఎంపికతో పాటు ఉపాధి హామీ ద్వారా వివిధ శాఖల్లో చేపడుతున్న పనులపై సమీక్షించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, వ్యవసాయ శాఖ సెక్రటరీ జనార్దన్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, జీహెచ్​ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పాల్గొన్నారు.

Tags:    

Similar News