రాష్ట్రంలో పచ్చదనం పెంచాలి: సీఎస్
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రమంతా పచ్చదనం వెల్లివిరియాలని, ప్రతీ గ్రామంలో మొక్కల పెంపకాన్ని విస్తృతంగా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో మిషన్ మోడ్ తరహాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే అంశంపై అన్నిశాఖలు దృష్టి సారించాలని సూచించారు. అర్బన్ ఫారెస్ట్ పై సీఎస్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అడవుల పునర్జీవంతో పాటు ఆక్రమణల నుంచి కాపాడాలన్న సీఎం కేసీఆర్ విజన్‌ను అమలు […]
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రమంతా పచ్చదనం వెల్లివిరియాలని, ప్రతీ గ్రామంలో మొక్కల పెంపకాన్ని విస్తృతంగా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో మిషన్ మోడ్ తరహాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే అంశంపై అన్నిశాఖలు దృష్టి సారించాలని సూచించారు. అర్బన్ ఫారెస్ట్ పై సీఎస్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అడవుల పునర్జీవంతో పాటు ఆక్రమణల నుంచి కాపాడాలన్న సీఎం కేసీఆర్ విజన్‌ను అమలు చేయడానికి అధికారులు పచ్చదనాన్ని పెంపొందించడానికి పనిచేయాలన్నారు. రాష్ట్రంలో 129 లొకేషన్లలోని 188 ఫారెస్ట్ బ్లాక్‌ల్లో 1.60 లక్షల ఎకరాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నివసించడానికి మొక్కలు నాటడానికి వీలున్న ప్రతి చోటా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎస్ అధికారులను కోరారు.
జీహెచ్‌ఎంసీ ద్వారా సమగ్ర రోడ్‌మేనేజ్‌మెంట్ కార్యక్రమం కింద చేపడుతున్న రోడ్లకు ఇరు పక్కల, స్మశాన వాటికలు, పాఠశాలలు, చెరువులు , డ్రైన్‌ల వెంట భారీగా మొక్కలు నాటి విజిబుల్ ఇంపాక్ట్ కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మెట్రో కారిడార్‌ల ఇరుపక్కల, మీడియం డిపోల దగ్గర పచ్చదనం పెంపొందించడానికి మొక్కలు నాటాలన్నారు. హెచ్‌ఎండిఏ, టిఎస్‌ఐఐసీ, హెచ్‌ఎంఆర్‌ఎల్, అటవీశాఖ ద్వారా అర్బన్‌పారెస్ట్ బ్లాక్‌లలో వెంటనే మొక్కలు నాటాలని ఆదేశించారు. కంపా నిధుల కింద అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌లను అభివృద్ధి చేసేందుకు కేంద్రానికి పంపించాలని, రూ. 900తో కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ల కోసం కంపా కింద ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్‌ని ఏర్పాటు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, పీసీసీఎఫ్ శోభ, సీఎం ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్ తదితరులు పాల్గొన్నారు.