బ్యాంకర్లకు వ్యాక్సిన్‌ వేయండి.. అధికారులకు సీఎస్ ఆదేశాలు

దిశ, తెలంగాణ బ్యూరో: బ్యాంకు సిబ్బందికి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి టీకా వేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం వివిధ బ్యాంకుల ప్రతినిధులు, అధికారులతో.. సిబ్బందికి వ్యాక్సినేషన్ అందించే అంశంపై బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో సమావేశం నిర్వహించారు. వారం రోజుల్లో బ్యాంకుల్లో విధులు నిర్వహించే అన్ని రకాల సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ చేపట్టాలని సూచించారు. ఇందుకు సబంధించిన జాబితాను బ్యాంక్ ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకొని సేకరించాలని తెలిపారు. అక్టోబర్‌లోగా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించేలా […]

Update: 2021-06-05 08:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బ్యాంకు సిబ్బందికి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి టీకా వేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం వివిధ బ్యాంకుల ప్రతినిధులు, అధికారులతో.. సిబ్బందికి వ్యాక్సినేషన్ అందించే అంశంపై బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో సమావేశం నిర్వహించారు. వారం రోజుల్లో బ్యాంకుల్లో విధులు నిర్వహించే అన్ని రకాల సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ చేపట్టాలని సూచించారు. ఇందుకు సబంధించిన జాబితాను బ్యాంక్ ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకొని సేకరించాలని తెలిపారు. అక్టోబర్‌లోగా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసిఆర్ ఆదేశించినట్టుగా సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. మొదటి దశలో హై ఎక్స్ పోజర్ గ్రూప్స్‌కు వ్యాక్సిన్ అందించామని, ఆ తర్వాత ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేస్తున్న వారికి దశల వారీగా వ్యాక్సిన్ ప్రక్రియను చేపట్టామని, ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం ద్వారా అధిక మొత్తంలో వ్యాక్సిన్ డోస్ లను పొందేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, పరిశ్రమలు, ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఎస్‌ఎల్‌బీసి కన్వీనర్ శ్రీ కృష్ణ శర్మ, చైర్మన్ ఏపిజీవిబి ప్రవీణ్ కుమార్, టీఎస్ సీఓబి మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. మురళీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News