కరోనా ప్రభావం పోలేదు.. టీకా తీసుకుంటే టెన్షన్ అవసరం లేదు : సీఎస్

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘రాష్ట్రంలో కరోనా ముప్పు పోలేదు. ప్రమాదం ఇంకా ఉన్నది. ప్రతీ ఒక్కరూ రెండు డోసులు తీసుకోవాల్సిందే. పుల్​వ్యాక్సినేషన్ పూర్తయితేనే డేంజర్​ నుంచి బయటపడవచ్చు. ఇప్పటికే 3 కోట్ల డోసులను పంపిణీ చేశాం. అతి తొందరలో అందరినీ కవర్ చేస్తాం. థర్డ్​వేవ్​ఎప్పుడు వస్తుందో తెలియదు. అయినా ప్రభుత్వ పరంగా సర్వం సన్నద్ధంగా ఉన్నాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆక్సిజన్‌కు కొరత రానివ్వం.’’ అని సీఎస్​ సోమేష్​కుమార్​వ్యాఖ్యానించారు. తెలంగాణలో 3 కోట్ల పంపిణీ పూర్తైన క్రమంలో […]

Update: 2021-10-22 11:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘రాష్ట్రంలో కరోనా ముప్పు పోలేదు. ప్రమాదం ఇంకా ఉన్నది. ప్రతీ ఒక్కరూ రెండు డోసులు తీసుకోవాల్సిందే. పుల్​వ్యాక్సినేషన్ పూర్తయితేనే డేంజర్​ నుంచి బయటపడవచ్చు. ఇప్పటికే 3 కోట్ల డోసులను పంపిణీ చేశాం. అతి తొందరలో అందరినీ కవర్ చేస్తాం. థర్డ్​వేవ్​ఎప్పుడు వస్తుందో తెలియదు. అయినా ప్రభుత్వ పరంగా సర్వం సన్నద్ధంగా ఉన్నాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆక్సిజన్‌కు కొరత రానివ్వం.’’ అని సీఎస్​ సోమేష్​కుమార్​వ్యాఖ్యానించారు. తెలంగాణలో 3 కోట్ల పంపిణీ పూర్తైన క్రమంలో కోఠి ఆరోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కేక్​కటింగ్​కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్​మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన వ్యాక్సినేషన్​విధాన్నాన్ని ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు. గత 18 నెలల నుంచి అలసట లేకుండా పనిచేస్తున్న హెల్త్​కేర్​వర్కర్లకు సెల్యూట్ చేశారు.

అతి తక్కువ సమయంలోనే లక్ష్యాన్ని పూర్తి చేశామన్నారు. ఈ మహాత్తర కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది నిర్విరామంగా కృషి చేస్తున్నారన్నారు. అనంతరం హెల్త్ సెక్రటరీ రిజ్వీ మాట్లాడుతూ.. రిమోట్ ఏరియాల్లోనూ అద్భుతంగా పంపిణీ చేస్తున్నారన్నారు. టీకాల ఉత్పత్తి తక్కువున్న సమయంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సూపర్ స్ప్రెడర్స్ పేరుతో చాలా స్పీడ్‌గా వాక్సినేషన్‌ను నిర్వహించామన్నారు. దీంతో పాటు అర్హులకు వేగంగా టీకాలు అందేందుకు స్పెషల్ డ్రైవ్‌లు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. జనాలు ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్లి అందజేయడం అద్భుతమన్నారు. ప్రతీ రోజు సగటున 3లక్షల టీకాలను అందజేసినట్టు వివరించారు.

హెల్త్ డైరెక్టర్​డాక్టర్ జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మిగతా వారందరికీ కేవలం నెల రోజుల్లో డోసులను పంపిణీ చేస్తామన్నారు. వేవ్‌లు రాకుండా వ్యాక్సిన్లే కాపాడతాయన్నారు. అయితే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన దగ్గర థర్డ్​వేవ్ ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేశామన్నారు. ఇప్పటికే 27 వేల ఆక్సిజన్​బెడ్లను సిద్ధం చేశామన్నారు. దీంతో పాటు అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ ప్రతీ బెడ్‌కు ఆక్సిజన్​సదుపాయాన్ని కల్పించామన్నారు. ఈసారి ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వీళ్లేదని హెచ్చరించారు. అర్హులైన వారు వెంటనే టీకా పొందాలని ఆయన సూచించారు. జనవరి 2022 వరకు రాష్ట్రాన్ని కరోనా రహితంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని ఆయన కోరారు.

Tags:    

Similar News