కోతులు, పందుల కోసం సీఎస్ ఉన్నతస్థాయి సమావేశం

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కోతులు, అడవి పందులతో తలెత్తుతున్న సమస్యలపై బుధవారం బీఆర్కే భవన్‌లో సీఎస్‌ సోమేశ్ కుమార్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలోనే కోతులు, పందులతో తలెత్తిన సమస్యల నివారణ కోసం చేపట్టాల్సిన చర్యలపై అటవీ, వ్యవసాయ, పురపాలక శాఖలు, పశువైద్య విశ్వవిద్యాలయం అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సీఎస్ చర్చలు జరిపారు. ఇదే విషయంపై‌ Office of Chief Secretary ట్వీట్ చేసింది. రాష్ట్రంలో కోతులు, అడవి పందులతో తలెత్తుతున్న […]

Update: 2021-12-01 06:52 GMT
కోతులు, పందుల కోసం సీఎస్ ఉన్నతస్థాయి సమావేశం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కోతులు, అడవి పందులతో తలెత్తుతున్న సమస్యలపై బుధవారం బీఆర్కే భవన్‌లో సీఎస్‌ సోమేశ్ కుమార్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలోనే కోతులు, పందులతో తలెత్తిన సమస్యల నివారణ కోసం చేపట్టాల్సిన చర్యలపై అటవీ, వ్యవసాయ, పురపాలక శాఖలు, పశువైద్య విశ్వవిద్యాలయం అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సీఎస్ చర్చలు జరిపారు. ఇదే విషయంపై‌ Office of Chief Secretary ట్వీట్ చేసింది.

‘రాష్ట్రంలో కోతులు, అడవి పందులతో తలెత్తుతున్న సమస్యలు, చేపట్టాల్సిన చర్యలపై బీఆర్కేఆర్ భవన్ లో సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో నేడు ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. అటవీ, వ్యవసాయ, పురపాలక శాఖలు, పశువైద్య విశ్వవిద్యాలయం అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అటవీ, పశువైద్యం, వ్యవసాయ శాఖల నిపుణులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ప్రభావశీల విధానాల్ని అధ్యయనం చేసి తగు ప్రతిపాదనలు వారం రోజుల్లోగా ఈ కమిటీ సమర్పిస్తుంది. కోతుల సంఖ్యను నియంత్రించేందుకై మరిన్ని సంతాన నిరోధక ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటు. పంటలను కోతులనుండి కాపాడటానికి పలు సాంప్రదాయక విధానాలపై రైతులు, పౌరులను చైతన్యపరచే కార్యక్రమాల నిర్వహణ’ చేపడుతామంటూ సీఎస్ ఆఫీస్‌ వెల్లడించింది.

Tags:    

Similar News