సీఎస్గారూ.. టైం ఇస్తారా? కోర్టుకు వెళ్లమంటారా?
దిశ, తెలంగాణ బ్యూరో: మేం ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం అమలు చేస్తోన్న కొత్త నిబంధనల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం. ధరణి పోర్టల్‌లో 17 రకాల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. భూములు అమ్ముకోవాలన్నా రిజిస్ట్రేషన్ కావడం లేదు. ఇలాంటి సమస్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ దృష్టికి తీసుకొచ్చేందుకు ఏడాదిగా ప్రయత్నిస్తున్నాం. కానీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. తమ బాధలు చెప్పుకునేందుకు కూడా అవకాశం కల్పించకపోవడాన్ని […]
దిశ, తెలంగాణ బ్యూరో: మేం ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం అమలు చేస్తోన్న కొత్త నిబంధనల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం. ధరణి పోర్టల్‌లో 17 రకాల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. భూములు అమ్ముకోవాలన్నా రిజిస్ట్రేషన్ కావడం లేదు. ఇలాంటి సమస్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ దృష్టికి తీసుకొచ్చేందుకు ఏడాదిగా ప్రయత్నిస్తున్నాం. కానీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. తమ బాధలు చెప్పుకునేందుకు కూడా అవకాశం కల్పించకపోవడాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
గ్రామ పంచాయతీ లేఅవుట్లలో నిలిపివేసిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గించాలని, ఎల్ఆర్ఎస్ చార్జీలు పెరగడం వల్ల పేద, మధ్య తరగతి వర్గాలు ఇండ్లు కట్టుకోవడం అసాధ్యంగా మారిందన్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలను 7.5 శాతం నుంచి 3 శాతానికి తగ్గించాలని, ఎల్ఆర్ఎస్ పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలని కోరారు. అలాగే ఫాం సైట్లలో కూడా 200 గజాలు కొనుక్కోకుండా చేశారని మండిపడ్డారు.
40 సార్లు వినతి
రియల్టర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నారగోని ప్రవీణ్ కుమార్ 40 సార్లు ప్రయత్నించారు. సీఎస్‌కు అన్ని వివరించాలన్న ఆయన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గురువారం కూడా సీఎస్ కార్యాలయానికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఇప్పించాలని వేడుకున్నారు. ఏడాది కాలంగా ఇలా ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశానన్న విషయాన్ని ఆయన వివరించారు. ఏయే సమస్యల పరిష్కారం కోసం టైం అడుగుతున్నారో కూడా వివరించారు. అధికారులు మాత్రం మీ దరఖాస్తును మెయిల్ ద్వారా సీఎస్‌కు సమర్పించాలని సూచించారు. అలాంటి ప్రక్రియలు కూడా ఎన్నోసార్లు చేసినట్లు గుర్తు చేశారు.
మరోసారి అపాయింట్మెంట్ కోసం మెయిల్ ద్వారా అప్లికేషన్ పంపాలని ఉచిత సలహా ఇచ్చారు. కార్యాలయం సూచన మేరకు గురువారం 10 మంది అసోసియేషన్ సభ్యులు అపాయింట్మెంట్ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మెయిల్ చేశారు. ఇప్పటికైనా ఆయన సమయం ఇస్తారా, ఇవ్వరా? అని వేచి చూస్తున్నట్లు ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఇకపై సీఎస్ అపాయింట్మెంట్ కోరుతూ హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు.