ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రేక్షకులకు అనుమతి
దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌కు ప్రతీ రోజు 30వేల మంది ప్రేక్షకులు హాజరవడానికి విక్టోరియా ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఒక రోజులో జరిగే మ్యాచ్‌లకు విడతల వారీగా 30 వేల మందికి టికెట్లు విక్రయించుకోవచ్చని నిర్వాహకులకు స్పష్టం చేసింది. కరోనా కారణంగా కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నందునా.. నిర్వాహకులు ఆ నిబంధనలకు లోబడే ప్రేక్షకులను అనుమతించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు వారాల పాటు జరిగే ఆస్ట్రేలియా ఓపెన్‌కు దాదాపు 4 లక్షల […]
దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌కు ప్రతీ రోజు 30వేల మంది ప్రేక్షకులు హాజరవడానికి విక్టోరియా ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఒక రోజులో జరిగే మ్యాచ్‌లకు విడతల వారీగా 30 వేల మందికి టికెట్లు విక్రయించుకోవచ్చని నిర్వాహకులకు స్పష్టం చేసింది. కరోనా కారణంగా కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నందునా.. నిర్వాహకులు ఆ నిబంధనలకు లోబడే ప్రేక్షకులను అనుమతించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు వారాల పాటు జరిగే ఆస్ట్రేలియా ఓపెన్‌కు దాదాపు 4 లక్షల మంది ప్రేక్షకులు స్టేడియంలో కూర్చొని వీక్షించడానికి అనుమతి ఇస్తున్నట్లు విక్టోరియా రాష్ట్ర క్రీడా మంత్రి మార్టిన్ పాకుల చెప్పారు.
ఫిబ్రవరి 8 నుంచి మెయిన్ డ్రా మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్‌లలో ఉదయం 15 వేలు, సాయంత్రం 15 వేల మందికి టికెట్లు విక్రయించవచ్చు. అయితే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల నుంచి ఆ సంఖ్యను 25 వేలకు తగ్గించాలని నిర్వాహకులకు స్పష్టం చేసింది. కాగా, ఇతర దేశాల నుంచి వచ్చిన టెన్నిస్ క్రీడాకారులు, కోచ్‌లు, ఇతర సిబ్బంది 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం ముమ్మరంగా ప్రాక్టీస్ట్ చేస్తున్నారు.