ప్రాణహిత ఉగ్రరూపం… నీట మునిగిన పంట

దిశప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దున ఉన్న ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్రలో వర్షాలు మేడిగడ్డ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలంలో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కోటపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో వరద నీరు వ్యవసాయ భూముల్లోకి వచ్చి చేరుతోంది. దీని కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగినట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ గేట్లు మూసి ఉన్న కారణంగా […]

Update: 2020-08-31 11:56 GMT

దిశప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దున ఉన్న ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్రలో వర్షాలు మేడిగడ్డ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలంలో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కోటపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో వరద నీరు వ్యవసాయ భూముల్లోకి వచ్చి చేరుతోంది. దీని కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగినట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.

కాలేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ గేట్లు మూసి ఉన్న కారణంగా దీని బ్యాక్ వాటర్ పెద్ద మొత్తంలో తన్ని పడుతోంది. వరద నీరు ముందుకు వెళ్లలేని పరిస్థితులకు తోడు, బ్యాక్ వాటర్ వస్తుండడంతో వరద ముంచెత్తుతోంది. కోటపల్లి మండలంలోని సుమారు ఐదారు గ్రామాల్లో వేలాది ఎకరాలు నీటమునిగాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాగా జిల్లా రెవెన్యూ యంత్రాంగం కోటపల్లి మండల ప్రాణహిత పరివాహక గ్రామాలను అప్రమత్తం చేసింది.

Tags:    

Similar News