పెరు జూలో అద్భుతం.. కృత్రిమ గర్భం దాల్చిన మొసలి

దిశ, వెబ్‌డెస్క్ : కృత్రిమ గర్భాధారణ మెడికల్ హిస్టరీలో ఓ రెవల్యూషన్. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో సైంటిస్టులు కొత్తకొత్త అద్భుతాలు సృష్టిస్తున్నారు. వీటికి తోడు వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలు కూడా వెలువడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అంతరించిపోతున్న పలు జంతు, జీవరాశుల జాతులను కాపాడుకునేందుకు సైంటిస్టులు పరిశోధనలు సాగిస్తున్నారు. అందులో భాగంగా పుట్టుకొచ్చినదే ‘ఆర్టిఫిషియల్ ఇనిసెమినేషన్’. త్వరలో అంతరించిపోయేందుకు సిద్ధంగా ఉన్న జీవరాశులను కాపాడుకోవడంతో పాటు, ఒక కొత్త రకం జంతు జాతిని […]

Update: 2021-02-07 11:21 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కృత్రిమ గర్భాధారణ మెడికల్ హిస్టరీలో ఓ రెవల్యూషన్. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో సైంటిస్టులు కొత్తకొత్త అద్భుతాలు సృష్టిస్తున్నారు. వీటికి తోడు వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలు కూడా వెలువడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అంతరించిపోతున్న పలు జంతు, జీవరాశుల జాతులను కాపాడుకునేందుకు సైంటిస్టులు పరిశోధనలు సాగిస్తున్నారు. అందులో భాగంగా పుట్టుకొచ్చినదే ‘ఆర్టిఫిషియల్ ఇనిసెమినేషన్’.

త్వరలో అంతరించిపోయేందుకు సిద్ధంగా ఉన్న జీవరాశులను కాపాడుకోవడంతో పాటు, ఒక కొత్త రకం జంతు జాతిని సృష్టించేందుకు సైంటిస్టులు ఈ ప్రక్రియను విరివిగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ సక్సెస్ ఫుల్ రిజల్ట్స్‌ను కనబరుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా జంతువులపై చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా, కృత్రిమ గర్భాధారణ అనేది మనుషులపై కూడా సక్సెస్ అయింది. పిల్లలు లేని చాలా మంది తల్లిదండ్రులు ఈ ప్రక్రియనే నమ్ముకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు. మనదేశంలోనే పలువురు సెలెబ్రిటీలు, పెద్ద మనుషులు దీని ద్వారా ఆరోగ్యవంతమైన పిల్లలను పొందారు. దీనిపై పలు సినిమాలూ వచ్చాయి. ఇండియాలో అయితే ముఖ్యంగా పశుపోషణ, అధిక పాల దిగుబడులనిచ్చే పశు సంపదను అభివృద్ధి చేయడంలో సైంటిస్టులు ఈ ప్రక్రియను ఎక్కువగా ఫాలో అవుతున్నారు.

తాజాగా పెరులోని జంతు ప్రదర్శనశాలలో ఓ మొసలిపై తొలిసారి ప్రయోగం చేయగా అది కృత్రిమ గర్భం దాల్చింది. ఆ తర్వాత మొసలి 24 గుడ్లను పెట్టగా వాటిని 90 రోజుల వరకు ఇంక్యుబేషన్‌లో ఉంచి ప్రాసెస్ చేశారు. అయితే, అందులో రెండు పిల్లలు మాత్రమే ప్రాణాలతో బయటపడగా, మిగతావి మరణించినట్లు జూ అధికారులు పేర్కొన్నారు. అమెరికన్ జాతికి చెందిన మొసళ్లను అభివృద్ధి చేసే క్రమంలో వాటి ‘సెమెన్‌’ను జూ లోని ఆడ మొసలిపై ప్రయోగించినట్లు తెలిపారు. జన్మించిన మొసలి పిల్లలు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, వాటి బరువు 45గ్రాములు, 35 సెంటీమీటర్లు పొడవు ఉన్నట్లు జూ నిర్వాహకులు చెబుతున్నారు.

 

Tags:    

Similar News