ఒంటెల రవాణా, వధించడం నేరం

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలోకి ఇతర ప్రాంతాల నుంచి ఒంటెల రవాణా, వాటిని కబేళాల్లో వధించడం వంటివి తీవ్రమైన నేరంగా ప్రభుత్వం పరిగణిస్తున్నట్టు పశుసంవర్ధక శాఖ వెల్లడించింది. ఈ మేరకు పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి బుధవారం ప్రకటన విడుదల చేశారు. రాజస్తాన్ ఒంటెల రవాణా, వధ నిషేధిత చట్టం-2015 ప్రకారం ఎవరైనా రాష్ట్రంలోకి ఒంటెలను అక్రమంగా తరలించినా, వాటిని వధించినా చట్టప్రకారం తీవ్రనేరంగా పరిగణిస్తామన్నారు. హైకోర్టు దీనికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని, ఒంటెల రవాణా, […]

Update: 2020-07-22 07:23 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలోకి ఇతర ప్రాంతాల నుంచి ఒంటెల రవాణా, వాటిని కబేళాల్లో వధించడం వంటివి తీవ్రమైన నేరంగా ప్రభుత్వం పరిగణిస్తున్నట్టు పశుసంవర్ధక శాఖ వెల్లడించింది. ఈ మేరకు పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి బుధవారం ప్రకటన విడుదల చేశారు. రాజస్తాన్ ఒంటెల రవాణా, వధ నిషేధిత చట్టం-2015 ప్రకారం ఎవరైనా రాష్ట్రంలోకి ఒంటెలను అక్రమంగా తరలించినా, వాటిని వధించినా చట్టప్రకారం తీవ్రనేరంగా పరిగణిస్తామన్నారు. హైకోర్టు దీనికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని, ఒంటెల రవాణా, వధించడం అమానవీయమని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తారని లక్ష్మారెడ్డి తెలిపారు.

Tags:    

Similar News