Rape attempt: బాలికపై అత్యాచారయత్నం.. పోలీసుల అదుపులో నిందితుడు

నగరంలోని ఓ మైనర్ బాలికపై వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-08-31 04:59 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నగరంలోని ఓ మైనర్ బాలికపై వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీకి చెందిన బాలిక శుక్రవారం మధ్యాహ్న సమయంలో కిరాణ షాపునకు వెళ్లి వస్తుండగా ఓ వ్యక్తి బాలికను అడ్డగించాడు. అనంతరంత ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అయితే, విషయాన్ని బాలిక తన కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. 


Similar News