తీవ్ర విషాదం.. పొట్టకూటి కోసం వెళ్లి అనంతలోకాలకు
పొట్ట చేత పట్టుకొని సర్కస్ చేసే వాళ్ళు ఊరు రా
దిశ, వెబ్ డెస్క్ : పొట్ట చేత పట్టుకొని సర్కస్ చేసే వాళ్ళు ఊరు రా తిరుగుతుంటారు.అదే వారికి జీవనాధారం. పుటా గడపటానికి వారు చేసే విన్యాసాలు అంత ఇంత కాదు. ఆట పాటలతో అలరిస్తుంటారు. వారు చేసే ప్రదర్శన చూపరులను ఆకట్టుకోవడానికి ఎంతటి విస్యసానికైన తెగిస్తారు. కోతులతో, పాములతో ఆటాలాడిస్తుంటారు.ఝార్ఖండ్‌లో సర్కస్ చేస్తున్న సమయంలో విషాద ఘటన చోటు చేసుకుంది.
ఝార్ఖండ్ కి చెందిన 60 ఏళ్ల వ్యక్తి సర్కస్ చేస్తూ జీవనం సాగించేవాడు. కొండచిలువను మెడకు చుట్టుకొని ప్రదర్శన చేస్తూ పూట గడుపుకునే వాడు. అందులో భాగంగానే కొండచిలువను మెడకు వేసుకుని ఆడిస్తుండగా ప్రమాదవశాత్తు అది అతని మెడను గట్టిగా పట్టేసింది. ఊపిరాడక ఆ వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండచిలువను అటవీశాఖ అధికారులకు అప్పగించారు.