విద్యుదాఘాతంతో రైతు మృతి.. ట్రాన్స్ ఫార్మర్ ఆఫ్ చేస్తుండగా ప్రమాదం

విద్యుత్ ప్రమాదానికి గురై ఒక యువ రైతు తన ప్రాణాలను

Update: 2024-08-18 15:17 GMT

దిశ,నేరేడుచర్ల (పాలకవీడు) : విద్యుత్ ప్రమాదానికి గురై ఒక యువ రైతు తన ప్రాణాలను కోల్పోయిన సంఘటన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని బెట్టేతండా గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బెట్టే తండాకు చెందిన బండావత్ సైదులు (32)అనే యువరైతు తన సొంత పొలంలో ఉన్న విద్యుత్ మోటార్ కు విద్యుత్ సరఫరా కావడం లేదని దాన్ని చూసేందుకు ఆ విద్యుత్ కనెక్షన్ ఉన్న ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లాడు. ఆ ట్రాన్స్ ఫార్మర్ ట్రిప్ అయిందని ఆ ట్రాన్స్ ఫార్మర్ ని ఆఫ్ చేసి సరి చేద్దామనే క్రమంలో ఆఫ్ చేసే హ్యాండిల్ కు విద్యుత్ సరఫరా అయ్యి ప్రమాదానికి గురయ్యాడు. ఆ సమయంలో ట్రాన్స్ ఫార్మర్ వద్ద పెద్దగా శబ్దాలు రావడం తో సమీపంలోని రైతులు గమనించి వెళ్ళేసరికి అక్కడ సైదులు పడి ఉన్నాడు. 

గుర్తించి వెంటనే స్థానికులకు సమాచారం అందించి మిర్యాలగూడ లోని గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్లేసరికి డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించినట్లు తెలిపారు. విద్యుత్ అధికారుల వల్లనే సైదులు మృతి చెందాడని విద్యుత్ శాఖ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రాన్స్ ఫార్మర్ అప్పుడప్పుడు ఇలా ఆఫ్ చేసే హ్యాండిల్ కు షాక్ వస్తుందని గతంలో చెప్పిన పట్టించుకోవడం లేదని అధికారులు పట్టించుకుని ఉంటే ఈరోజు సైదులు మృతిచెంది ఉండడని అంటున్నారు. మృతుడి భార్య రజిత ఇటీవలే పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా ఉద్యోగం పొంది హైదరాబాద్ లో ట్రైనింగ్ లో ఉంది. మృతునికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. మృతుని సోదరుడు బండవ కిషన్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పాలకవీడు ఎస్సై లక్ష్మీ నరసయ్య తెలిపారు.


Similar News